ప్రజలందరికి సంక్రాంతి శుభాకాంక్షలు: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, జనవరి 14 (విశ్వం న్యూస్) : హైదరాబాద్లోని కేబీఆర్ పార్కులో భారత్ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన భోగి వేడుకల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనలోని ప్రతికూలతలను విడిచిపెట్టి నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్దామన్నారు. తెలంగాణ జాగృతి నుంచి భారత్ జాగృతిగా రూపాంతరం చెందాక మొదటి సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, భోగ భాగ్యాలతో ఉండాలని, మన సంస్కృతి, సంప్రదాయాలను నిలబెడుతూ కలిసిమెలిసి ఉండాలని, మీ వల్ల అందరికీ మంచి జరగాలని, విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి మీవంతు కృషి చేయాలని కోరుకుంటూ.. ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనః స్పూర్తిగా ప్రార్థిస్తూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.