మైనారిటీలకు హరీష్ రావు
వెంటనే క్షమాపణ చెప్పాలి

- మైనారిటీల మనోభావాలు
దెబ్బతినేలా మాట్లాడిన హరీష్ రావు - మైనారిటీ సెల్ జిల్లా
అధ్యక్షుడు ఎండి తాజోద్ధిన్
కరీంనగర్ బ్యూరో, జూలై 22 (విశ్వం న్యూస్) : హైదరాబాద్ లో జరిగిన సంచార జాతుల మైనారిటీల సమావేశంలో ఫకీర్లని ఆర్థిక మంత్రి హరీష్ రావు సంబోధించడాన్ని జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎండి తాజోధ్ధిన్ తీవ్రంగా ఖండించారు.
నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన హరీష్ రావు వెంటనే మైనారిటీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మైనారిటీలను కేవలం ఓటు బ్యాంక్ గా వాడుకుంటున్నారని కనీస గౌరవం ఇవ్వడం లేదని బిజెపి ప్రవేశపెట్టే బిల్లులన్నిటికి పూర్తి మద్దతు ఇస్తున్న బిఆర్ఎస్ పార్టీ కి రాబోయే ఎన్నికలలో మైనారిటీలంత సంఘటితమై బుద్ది చెప్పాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ మాత్రమే మైనారిటీల సంక్షేమం గౌరవం కాపాడుతుందని తాజొద్ధీన్ అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో ఎండి చాంద్, దన్న సింగ్, లయక్, నిహల్ అహ్మద్, నదీమ్, మహమ్మద్ భారీ, ఎండి కరీముద్దిన్ సాజిద్, హనీఫ్ తదితరులు పాల్గొన్నారు.