
- తెలంగాణ నూతన సచివాలయంపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్వీట్
- మేము భవనాలను ఆకృతి చేస్తాము. ఆ తర్వాత ఆ భవనాలు మనల్ని ఒక ఆకృతిలోకి తీసుకువస్తాయని ఆ కోట్ అర్థం.

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విశ్వం న్యూస్) : మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే నూతన సచివాలయం తెలంగాణ చరిత్రను ప్రతిభింబించేదిలా ఉంటుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రారంభోత్సవం ఏప్రిల్ 30న జరగనుంది.

తెలంగాణ నూతన సచివాలయంపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు విన్‌స్టన్ చర్చిల్‌కు సంబంధించిన ఒక సూక్తిని హరీశ్‌రావు ట్వీట్ చేశారు. మేము భవనాలను ఆకృతి చేస్తాము. ఆ తర్వాత ఆ భవనాలు మనల్ని ఒక ఆకృతిలోకి తీసుకువస్తాయని ఆ కోట్ అర్థం. అంటే రాష్ట్ర ప్రగతికి ప్రతిబింబంగా ఉండే ఈ సచివాలయం.. భవిష్యత్‌లో మనకు మంచి మార్గనిర్దేశనం అవుతుందని దాని అర్థం.

ఈ భవన నిర్మాణానికి ఆర్కిటెక్స్‌గా చెన్నైకు చెందిన ఆస్కార్ అండ్ పొన్ని ఆర్కిటెక్టస్ అధిపతి ఆస్కార్ జి.కాన్సెస్సో, తన భార్య పొన్ని జి.కాన్సెస్సో దంపతులు పనిచేశారు.

నూతన సచివాలయం పనులు చివరి దశకు చేరుకున్నాయి.