న్యాయవాదులు ఇప్పుడు గుర్తుకు వచ్చారా మంత్రి గారు ??

కరీంనగర్, మార్చి 23 (విశ్వం న్యూస్) : తన నివాసానికి కూతవేటు దూరంలో ఉండే న్యాయస్థానానికి అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ కి రావడానికి ఇన్ని సంవత్సరాలు సమయం పట్టిందా స్థానిక ఎమ్మెల్యే మంత్రి గంగుల కమలాకర్ కు అని ఎద్దేవా చేశారు యువ న్యాయవాది జిల్లా కాంగ్రెస్ నాయకుడు మల్యాల సుజిత్ కుమార్. మంత్రి గంగుల కరీంనగర్ కోర్టులోని జిల్లా న్యాయవాదుల బార్ అసోసియేషన్ ని సందర్శించడం, పలురకాల హామీలు ఇవ్వడం సంతోషకరం కానీ ఇప్పుడు వారి విశ్వసనీయత మీద అనుమానాలున్నాయని అన్నారు సుజిత్ కుమార్. ఎందుకంటే గతంలో న్యాయవాద సంక్షేమానికి యువ న్యాయవాదులకు ఆర్ధిక భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని అలాగే పేద న్యాయవాదులకు సొంత స్థలంలో ఇళ్ళు కట్టుకోవడానికి ఆర్ధిక సహాయం చేస్తామని ప్రకటించి వాటిని ఇప్పటివరకు అమలుచేయట్లేదని ఇప్పుడు ఎన్నికలకు ముందు మళ్ళీ హామీలు ఇస్తున్నారని అన్నారు, మంత్రి గంగుల చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే తక్షణమే తన హామీని నిలబెట్టుకొని ఇండ్ల స్థలాల పట్టాలు న్యాయవాదులందరికి ఇవ్వాలని, యువ న్యాయవాదులకు ఆర్ధిక తోడ్పాటుకై రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్డర్ ఇప్పించాలని లేని పక్షంలో మిమ్ముల్ని మీ ప్రభుత్వాన్ని నమ్మేది లేదని అన్నారు. జిల్లా బార్ అసోసియేషన్ లో ఎన్నికలు జరిగే ప్రక్రియ కొనసాగుతున్న రోజుల్లోనే రాజాకీయాలు చేయడం మంత్రి గంగుల, మేయర్ సునీల్ రావు, సర్దార్ రవీందర్ సింగ్ కి తగదని హితవు పలికారు మల్యాల సుజిత్ కుమార్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *