విద్యార్థులు ఇష్టపడి చదివితేనే ఉన్నత శిఖరాలు
ఎమ్మెల్యే డా.రసమయి సూచన, సలహా
తిమ్మాపూర్, జనవరి 5, (విశ్వం న్యూస్) : కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుతూ ఉన్నత శిఖరా లను అధిరోహించాలని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా.రస మయి బాలకిషన్ విద్యార్థులకు సూచించారు.
కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గ కేంద్రం లోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన బోధనా అభ్యాసన సామాగ్రి మేళాను ఆయన ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఉపాధ్యాయులు తయారు చేసిన బోధనా పరికరాలను పరిశీలించి, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎమ్మెల్యే రసమయి తిలకించి అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ జనార్ధన్, జడ్పిటిసి తాళ్లపల్లి శేఖర్ గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.