బాగున్నవా సంజీవ…

ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి కూతురు వివాహంలో
కలుసుకున్నకేసీఆర్ మంద సంజీవరెడ్డి
హైదరాబాద్, మే 14 (విశ్వం న్యూస్) : హైదరాబాద్ జిల్లా శంషాబాద్ ఎరెనా గార్డెన్ లో జరిగిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై నూతన వధూవరులు మనీషా- హిమదీప్ లను ఆశీర్వదించారు.
ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఘటకేసర్ మండల మాజీ జడ్పిటిసి సభ్యులు, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి రెడ్డి ఈ వివాహ కారిక్రమం చూసుకొని వెళుతున్న సమయంలో నమస్కారం సార్ ఎలా ఉన్నారు అని పలకరించగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ నేను బాగున్నా… బాగున్నవా సంజీవ అని పలకరిస్తూ కరాచలనం చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు కార్యకర్తలు బంధుమిత్రులు తదితరులు హాజరయ్యారు.