దళిత బందులో ఏ ఎమ్మెల్యే ఎంత లంచం తీసుకున్నారో ?

దళిత బందులో ఏ ఎమ్మెల్యే
ఎంత లంచం తీసుకున్నారో ?

దళిత కాంగ్రెస్ అద్యక్షులు శ్రీ నాగరిగారి ప్రీతం
హైదరాబాద్, ఏప్రిల్ 29 (విశ్వం న్యూస్) : ఈ రోజు గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో భాగంగా దళిత కాంగ్రెస్ అద్యక్షులు శ్రీ నాగరిగారి ప్రీతం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళిత బందు 10 లక్షల రూపాయలు ఇస్తాము అని మాట ఇచ్చారు. కానీ దళిత బందు అనేది దళితులకా ? లేక ధాలారులకా ?
అని వారు ప్రశ్నించారు.

దళిత బందు ఏర్పాటు చేసిన దగ్గర నుండి పేరు దళితులదీ సొమ్ము దలారులదిగా మారింది. ఈ మాట అంటున్నది కాంగ్రెస్ పార్టీయో లేక ఏ ఇతర పార్టీయో నిందలు మోపట్లేదు ప్రత్యక్షంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే వారి పార్టీ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు దళితుల దగ్గర నుండి 3 లక్షల రూపాయలు దండుకుంటున్నారు అని స్వయంగా అన్నారు. ఇది సిగ్గుచేటు అని ముఖ్యమంత్రి గారి పాలేర్లే ఎమ్మెల్యే లు, వారి అనుచరులు 3 లక్షలు దండుకుంటే దళిత బందు పేరుతో KCR గారు ఇంకా ఎన్ని కోట్లు దండుకుంటున్నారో ప్రజలు, యువత బాగా ఆలోచించాలని వారన్నారు. దళిత బందులో ఏ ఎమ్మెల్యే ఎంత లంచం తీసుకున్నారో నివేధిక ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

అస్సలు దళిత బందు ఎవరికి ఇస్తున్నారు ? మీ దృష్టిలో దళితులంటే ఎవరు ? మీ అనుచరులా ? మీ ఇంట్లో పని చేసే పనిమనుషులా లేదా సకల విధాలా అన్నీ సమకూరినటువంటివారా? వీళ్లా మీ దృష్టిలో దళితులు సిగ్గుండాలి. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న దళితులు ఎన్నో లక్షల మంది ఉన్న ఈ రాష్ట్రంలో మీకు నచ్చినటువంటి వారికి దళిత బందు పేరుతూ కూడా బెట్టుకుంటూ పోతే చూస్తూ ఊరుకునేది లేదు అన్నారు.

ఆనాడు ముఖ్యమంత్రి గారు ఏ అధికారి అయినా లంచం అడిగితే నాకు ఫోన్ చేయండి అని ఒక టోల్ ఫ్రీ నంబరును [040-23454071] ఇవ్వడం జరిగింది. కానీ ఆ నంబరు సర్వీసులో లేకపోవడం సిగ్గు చేటు అని ప్రెస్ మీట్ లో స్వయంగా నిరూపించి చెప్పారు. ఇక మీదట ఏ అధికారి అయినా మిమ్మల్ని లంచం అడిగితే వెంటనే చెప్పు తీసుకుని కొట్టండి మీ వెంట కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని ప్రీతం గారు భరోసా ఇవ్వడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *