మానవత్వం చాటుకున్న కార్పొరేటర్ శాలిని శ్రీకాంత్ గౌడ్

పీర్జాదిగూడ:మానవత్వం చాటుకున్న
కార్పొరేటర్ శాలిని శ్రీకాంత్ గౌడ్

  • షార్ట్ సర్క్యూట్ తో కాలిపోయిన ఐరన్ షాప్ కుటుంబానికి భరోసా

పీర్జాదిగూడ, మే 30 (విశ్వం న్యూస్) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 18వ డివిజన్ పార్వతి నగర్ నివాసి శ్రీకృష్ణ నగర్ లో నిన్న దురదృష్టవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఐరన్ షాప్ పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకొని వెంటనే స్పందించిన స్థానిక కార్పొరేటర్ కుర్ర శాలిని శ్రీకాంత్ గౌడ్ లు తక్షణ ఆర్థిక సాయం కింద పదివేల రూపాయలు అందజేయడం జరిగింది.

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్ లో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కార్డు నమోదు కార్యక్రమం పార్వతి నగర్ పార్టీ కార్యాలయం, బాలాజీ నగర్ అసోసియేషన్ కమిటీ హాల్, న్యూ శ్రీరామ్ నగర్ రామాలయంలో నమోదు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్థానిక కార్పొరేటర్ కుర్ర శాలిని శ్రీకాంత్ గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *