హుజురాబాద్:జీలుగా విత్తనాలు పంపిణీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి

హుజురాబాద్:జీలుగా విత్తనాలు
పంపిణీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి

హుజురాబాద్, మే 24 (విశ్వం న్యూస్) : రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో హుజురాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద జీలుగా విత్తనాలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ మరియు హుజురాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ పాడి కౌశిక్ రెడ్డి. ఈ సందర్భముగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు అందజేస్తుందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రభుత్వ రాయితీ పై అందుబాటులో జీలుగ విత్తనాలు
భూసారాన్ని పెంపొందించే పచ్చి రొట్టె పైరైన జీలుగ విత్తనాలు 65% రాయితీ పై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని సొసైటీ లలో రైతులకు అందుబాటులో ఉంచనైనది. 30 కిలోల బస్తా రెండున్నర ఎకరాలకు వస్తుంది. 1 బస్తా పూర్తి ధర 2407.5 రూపాయలు కాగా
రాయితీ పోను 1564.8 రూపాయలు కానీ రైతు చెల్లించాల్సినది : 842.7 రూపాయలు మాత్రమే.

హుజురాబాద్ నియోజకవర్గంలో జీలుగ మొత్తం
2210 క్వింటాళ్లు రూ.1,15,27,360 /-ప్రభుత్వ సిబ్సిడీ

జీలుగు విత్తనాల కోసం రైతులు

  1. పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్
  2. ఆధార్ కార్డు జిరాక్స్
    తీసుకొని సొసైటీ నందు జీలుగ విత్తనాలు పొందగలరని పాడి కౌశిక్ రెడ్డి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *