ఏసీటీఓ గజిటెడ్ హోదా
ఇచ్చినచో ప్రభుత్వంపై
ఎలాంటి ఆర్థిక భారం పడదు
- తెలంగాణ స్టేట్ టిసిటిఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో సయ్యద్ ముంతాజ్ అలీ రజ్వి ఐఏఎస్ ప్రిన్సిపాల్ సెక్రటరీ కమర్షియల్ టాక్స్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లకు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి
హైదరాబాద్, జూలై 13 (విశ్వం న్యూస్) : తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఏసీటీఓలకు గజిటెడ్ హోదా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వనికి గత ఏడు సంవత్సరాల నుండి ఈ సమస్యను పరిష్కరించాలని గత ప్రభుత్వంలో కూడా తెలంగాణ శాసనసభలో మజిలీస్ పార్టీ నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ ప్రభుత్వానికి రెండుసార్లు ప్రశ్నించడం జరిగింది. ఏసీటీఓలకు గజిటెడ్ హోదా ఇచ్చినంత మాత్రాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఎటువంటి భారం పడదు అని అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పడం జరిగింది.
ఆ ప్రభుత్వంలో ఏసీటీవోలకు గజిటెడ్ హోదా కల్పించలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ప్రజల సమస్యలతో పాటు, ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కారం చేస్తుందని మేము కూడా అంతర్గంతంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడ్డాము కావున తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం తరఫున, మంత్రులకు అన్ని రాజకీయ పార్టీ శాసనసభ్యులకు విజ్ఞప్తి చేయగా ప్రతి ఒక్కరు రాతపూర్వకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి లేఖలు ఇవ్వడం జరిగింది.
తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఇప్పటికైనా బాబా సాహెబ్ అంబేద్కర్ సచివాలయములో ఏసీటీఓ లకు సంబంధించిన ఫైల్ ను వెంటనే పరిష్కరించి ఏసీటీవోలకు గజిటెడ్ హోదా వచ్చినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2లో 1 ఏసిటిఓ, 2 డిప్యూటీ తాసిల్దార్, 3 కోపరేటివ్ రిజిస్టార్, 4 సబ్ రిజిస్టర్, 5 సబ్ ట్రెజరీ అధికారి, 6 మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, 7 మున్సిపల్ కమిషనర్ లాంటి అధికారులు అందరూ గ్రూప్ 2 పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పరిధిలో వస్తారు. అన్ని శాఖల్లో పని చేస్తున్న ఈ అధికారులు గజిటెడ్ హోదాలో కొనసాగుతున్నారు కానీ వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఏసిటిఓ లు నాన్ గజిటెడ్ గా కొనసాగుతున్నారు కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 పరీక్షలలో ఎక్కువ మార్పులు సాధించిన వారికి ఏసిటిఓగా వాణిజ్య పన్నుల శాఖలో కేటాయిస్తారు అలాంటి ఎక్కువ మార్కులు వచ్చిన అధికారులు నాన్ గజిటెడ్ కొనసాగుతున్నారు తక్కువ మార్కులు వచ్చిన అధికారులు గజిటెడ్ అధికారులుగా కొనసాగుతున్నారు ఎంత అన్యాయము జరుగుతుందో ఒక్కసారి ఆలోచించాలని ముజాహిద్ హుస్సేన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ఏసీటీవోలకు గజిటెడ్ హోదా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఖజానాపై ఎలాంటి భారం కూడా పడదు ప్రక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏసిటివోలకు గెజిటెడ్ హోదా ఇచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఏసిటిఓ లకుl గజిటెడ్ హోదా ఇవ్వాలని 2017 సంవత్సరములో అప్పటి రెవిన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ అజయ్ మిశ్రా ఐఏఎస్ కు తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో కలిసి మొట్టమొదటి రెప్రెసెంటేషన్ టిసిటిఎన్జీవోస్ సంఘం పక్షాన ఇచ్చిన అప్పటినుండి ఇప్పటివరకు ఏ సి టి ఓ లకు సంబంధించిన ఫైల్ మొట్టమొదటి పిఆర్సి కమిషన్ రికమండేషన్ చేయడం జరిగింది.
ఆర్థిక శాఖ ఆమోదం పరిచింది లా శాఖ ఆమోదం వచ్చింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ కూడా ఏసీటీవోలకు గెజిటెడ్ హోదా ఇవ్వచ్చని లేక ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జేఏడీ రికమండేషన్ చేయడం జరిగింది తెలంగాణ గజిటెడ్ ఉద్యోగుల సంఘం లేక ఇవ్వడం జరిగింది తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ గజిటెడ్ ఉద్యోగుల సంఘం లేక ఇవ్వడం జరిగింది ఇంతమంది ఇంత చేసినప్పటికీ ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున ఏసిటిఓలకు గజిటెడ్ హోదా ఇప్పటివరకు కల్పించకపోవడం చాలా బాధాకరమైన విషయం.
తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ సయ్యద్ ముంతాజ్ అలీ రజ్వి మాకు ఇప్పటికైనా న్యాయం చేసి ఏసీటీవోలకు గెజిటెడ్ హోదా ఇవ్వాలని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో కలిసి సంఘం పక్షాన విజ్ఞప్తి పత్రం అందజేయడం జరిగింది.