మంత్రి కేటిఆర్ జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అడుగు పెడితే అడ్డుకుంటాం

మంత్రి కేటిఆర్ జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అడుగు పెడితే అడ్డుకుంటాం

డా.కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, కరీంనగర్
కరీంనగర్, జనవరి 30 (విశ్వం న్యూస్) : ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ ను లండన్ న్యూయార్క్ సిటీలా మారుస్తామని, కరీంనగర్ కు ప్రభుత్వం మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని, నియోజకవర్గానికి 100పడుకల ఆసుపత్రి మంజూరు చేస్తామని, ఎన్నికల హామీలైన నిరుద్యోగ బృతి, దళితులకు మూడెకరాల భూమి, ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేయకపోవడం, తెలంగాణా ఉద్యమంలో భాగంగా యం.పి పదవికి రాజీనామా చేసిన కెసిఆర్ ను ఇక్కడి ప్రజలు రెండు సార్లు గెలిపిస్తే, కృతజ్ఞత లేకుండా వారిని మోసం చేస్తుంటే, మరోపక్క మంత్రి కేటిఆర్ గతంలో కరీంనగర్ పర్యటన సందర్భంగా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ, 2018 చివరినాటికి దాదాపు 150 కోట్లు ఖర్చుపెట్టి నగరంలో ప్రతి ఇంటికి 24గంటల నీటి సరఫరా అందిస్తామని, హైదరాబాద్ మెట్రో తరహాలో ఫుట్ పాత్ ల నిర్మాణం చేపడతామని, రాజకీయాలకతీతంగా అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడం, జిల్లాకు సంబంధించి, నేదునూరు పవర్ ప్రాజెక్ట్ పనులు నేటికీ ప్రారంభించక పోవడం మరియు ఇతర ఎన్నికల హామీలను విస్మరించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఈ విధంగా కెసిఆర్, కేటిఆర్ అభివ్రుద్దిలో జిల్లాను విస్మరించడం పట్ల జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పడంతో పాటు, ఇచ్చిన హామీలను నెరవేర్చిన తరువాతే, ఈ జిల్లాలో అడుగు పెట్టాలని లేదంటే, కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *