మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు

మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు

భారత్ జోడో యాత్రతో ప్రజల కష్టాలను తెలుసుకున్న రాహుల్
బిజెపి,ఆర్ఎస్ఎస్ వ్యతిరేక కూటములకు ఆయుధంలా రాహుల్

కరీంనగర్, జనవరి 30 (విశ్వం న్యూస్) : నేడు పూజ్య మహాత్మా గాంధీ వర్ధంతి మరియు భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పిసిసి నాయకులు వైద్యులు అంజన్ కుమార్ లతోపాటు పలువురు నాయకులు హాజరై మొదట మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి అనంతరం కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది.

తదుపరి కార్యక్రమాన్ని ఉద్దేశించి కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ, స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపించిన పూజ్య మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు దేశ సమైఖ్యత కోసం రాహుల్ గాంధీ గారు గత సెప్టెంబర్ 7న ప్రారంభించిన భారత్ జోడో యాత్ర 145 రోజులు, 75 జిల్లాలు, 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు, 12 బహిరంగ సభల ద్వారా కొనసాగుతూ 4,080 కిలోమీటర్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా, కాశ్మీర్ శ్రీనగర్ లోని లాల్ చౌక్ వద్ద రాహుల్ గాంధీ గారు జాతీయ జెండాను ఆవిష్కరించగా, వారికి సంఘీభావంగా ఎఐసిసి, పిసిసి పిలుపు మేరకు నేడు కరీంనగర్ డిసిసి కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకోవడం జరిగిందని, భారత్ జోడో యాత్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని, ఈ యాత్ర ద్వారా రాహుల్ గాంధీ గారు ప్రజల సమస్యలను కష్టాలను తెలుసుకున్నారని, ఈ దేశాన్ని పట్టిపీడిస్తున్న బిజెపి, ఆర్ఎస్ఎస్ ప్రజా వ్యతిరేక సిద్ధాంతాలను ఎండగడుతూ వాటిని సంహరించే ఒక ఆయుధంలా తయారయ్యారని, 2023లో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, జిల్లా కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షులు శ్రావణ్ నాయక్, పీసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ వెన్నరాజ మల్లయ్య, నాయకులు మడుపు మోహన్, కల్వల రామచందర్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, సలీముద్దీన్, గోపాల్ రెడ్డి, మామిడి సత్యనారాయణ రెడ్డి, దీకొండ శేఖర్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *