మద్యం తాగి వాహనం నడిపితే లైసెన్స్ రద్దు… చోధకులకు కౌన్సిలింగ్

మద్యం తాగి వాహనం నడిపితే లైసెన్స్ రద్దు… చోధకులకు కౌన్సిలింగ్

తాగి వాహనాలు నడిపిన చోధకులకు కౌన్సిలింగ్: హుజురాబాద్ ఏసిపి శ్రీ కోట్ల వెంకటరెడ్డి
హుజురాబాద్, ఫిబ్రవరి 8 (విశ్వం న్యూస్) : ఇటీవల కాలంలో మద్యం తాగి వాహనం నడిపి యాక్సిడెంట్స్ అయిన సంఘటనలు ఎక్కువగానే ఉన్నాయి. మద్యం తాగి వాహనాలు నడుపుతూ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడితే భవిష్యత్తులో చాలా కష్టాలు ఎదుర్కోవాలి. కోర్టులో ప్రతి కేసూ నమోదవుతుంది. జైలుకు వెళ్తే ఉద్యోగాలు పోతాయి. విద్యార్థులు, యువకులకు ఉద్యోగాలకి, విదేశాలకి వెళ్లాల్సి వస్తే ఈ కేసులు అడ్డొస్తాయి. డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడితే లైసెన్స్‌ తాత్కాలికంగా రద్దు అవుతుంది. కేసు తీవ్రతను బట్టి శాశ్వతంగా కూడా రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇకపై తాగి డ్రైవింగ్ చేయొద్దని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంటర్ కన్వెన్షన్ హాల్లో హుజురాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని తాగి వాహనాలు నడిపిన చోధకులకు హుజురాబాద్ ఏసిపి శ్రీ కోట్ల వెంకటరెడ్డి గారు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో హుజురాబాద్ పట్టణ సీఐ బొల్లం రమేష్, జమ్మికుంట టౌన్ సిఐ రామచందర్, జమ్మికుంట రూరల్ సీఐ సురేష్, హుజురాబాద్ ఎస్సై రాజన్న, మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *