ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీక

ఇఫ్తార్ విందులు మత
సామరస్యానికి ప్రతీక

  • ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందుకు ముఖ్యఅతిథిగా హాజరైన నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్.

కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 14 (విశ్వం న్యూస్) : ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని.. గంగా జమున తెహజీబ్ కు ప్రతిరూపంగా మారుతాయని నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ అన్నారు. శుక్రవారం ఎంఐఎం అధినేత బారిష్ఠర్ అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు ఎంఐఎం పార్టీ నగర శాఖ, ఎంఐఎం కార్పొరేటర్ల ఆధ్వర్యంలో అశోక్ నగర్ ఎన్ఎన్ గార్డెన్ లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి ఇఫ్తార్ విందుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ కు, ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, ఎంఐఎం కార్పొరేటర్లు, నాయకులు అలగునూర్ బ్రిడ్జి వద్ద ఘన స్వాగతం పలికారు.

ఉపవాస దీక్షలు పాటించే ముస్లిం సోదరులకు ఖర్జుర పండ్లు, డ్రైఫ్రూట్స్ ఏర్పాటు చేసి రోజాను విరమింపజేశారు. ఈసందర్భంగా జాఫర్ హుస్సేన్ మేరాజ్ మాట్లాడుతూ ఇఫ్తార్ విందులు స్నేహబంధాన్ని పెంపొందిస్తాయని, హిందూ ముస్లిం ఐక్యతకు మారుపేరుగా నిలుస్తాయన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో అల్లాహ్ మెప్పు కోసం నెల రోజుల పాటు కఠోర మైన ఉపవాస దీక్షలు పాటించి, నెల రోజులు ఖురాన్ పారాయణం, తరవీహ్ నమాజ్ క్రమం తప్పకుండా ఆచరించి పుణ్య ఫలాలు పొందడం గొప్ప ధార్మిక సంకల్పమని కొనియాడారు. మనిషి జీవితంలో సంపాదన, డబ్బు కంటే ఆధ్యాత్మిక చింతనే ముఖ్యమన్నారు. ఏడాదిలో 11 నెలలు తమ కోసం, ఒక నెల రమాజన్ మాసం మొత్తం అల్లాహ్ కోసం కేటాయించి, చిన్న తప్పు చేయకుండా, చెడుకు దూరంగా ఉండి పవిత్రమైన ఉపవాస దీక్షలు పాటించడం అంటే ఏకేశ్వరుడైన అల్లాహ్ కరుణా కటాక్షములు పొందడమేనన్నారు. టిఆర్ఎస్, ఎంఐఎం పార్టీల నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో సర్వ మతాలకు అన్ని విధాల ప్రాధాన్యం ఉండేదని నేడు అది కనిపించడం లేదన్నారు.

అనంతరం ఇఫ్తార్ విందుకు హాజరైన ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ కు పూలమాలలు, శాలువాతో ఇస్లామీయ సంప్రదాయ బద్దంగా ఎంఐఎం నాయకులు ఆత్మీయ సన్మానం చేశారు. ఈ దావాతే ఇఫ్తార్ విందుకు ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 10000 మందికి పైగా హాజరై విజయవంతం చేశారు. హాఫిజ్ యూసుఫ్ నమాజ్ మగ్రిబ్ చదివించగా, మౌలానా ఖయ్యుమ్ జియాయి దుఆ చేశారు. ఈకార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, ఎంఐఎం నగర ప్రధాన కార్యదర్శి బర్కత్ అలీ, జాయింట్ సెక్రటరీలు సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రీ, ఖమారుద్దీన్, కోశాధికారి ఇబ్రహీం బియబాని అడ్వకేట్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అఖీల్ ఫిరోజ్, కార్పొరేటర్ శర్ఫుద్దీన్, నాయకులు ఆతిన, అలిబాబా, అజర్ దబీర్, బొమ్మకల్ సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్, ఉమ్మడి జిల్లా ఎంఐఎం నాయకులు, నగర ఎంఐఎం డివిజన్ల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు, ఎస్సైలు, సీఐలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *