ఇలియానా:పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ

  • తల్లి కాబోతున్న ఇలియానా.. న్యూస్‌ చెప్పి షాకిచ్చిన గోవా బ్యూటీ

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విశ్వం న్యూస్) : ‘దేవదాసు’ తో ఎంట్రీ ఇచ్చింది గోవా బ్యూటీ ఇలియానా. ఆ తర్వాత పోకిరితో ఇండస్ట్రీ హిట్‌ సాధించింది. ఈ సినిమా తర్వాత ఇలియానా వెనక్కి తిరిగి చూసుకోలేదు.

కాగా తాజాగా ఈ బ్యూటీ చేసిన పోస్ట్‌ సంచలనం రేపుతుంది. త్వరలోనే తల్లి కాబోతున్నట్లు సోషల్‌ మీడియాలో చెప్పింది. తన మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నట్లు ఇన్‌స్టాలో తెలిపింది.

‘త్వరలో నిన్ను కలవడానికి ఎదురుచూస్తున్నాను.. నా చిట్టి డార్లింగ్’ అంటూ రెండు ఫోటోలను షేర్‌ చేసింది. అందులో మొదటి దాంట్లో ‘అడ్వేంచర్‌ మొదలవబోతుంది’ అని రాసి ఉన్న టీ షర్టును పోస్ట్‌ చేసింది. రెండో దాంట్లో మామా(అమ్మ) అనే లాకేట్‌ ఉంది. ఇలా రెండు ఫోటోలను షేర్‌ చేస్తూ తాను ప్రెగ్నెంట్‌ అని క్లారిటీ ఇచ్చేసింది.

ఆ బిడ్డకు తండ్రి ఎవరు? అని అడిగేవారు మాత్రం చాలా మందే ఉన్నారు. ఏదేమైనా ఇలియానా ప్రెగ్నన్సీ ఇష్యూ నెట్టింట వైరల్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *