లవ్వాలా గ్రామంలో:గిరిజన ప్రజలకు
అందుబాటులో తపాలా సేవలు
గోవిందరావుపేట, ఏప్రిల్ 29 (విశ్వం న్యూస్) : మారుమూల గిరిజన గ్రామాలకు తపాల శాఖ ద్వారా బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు రీజినల్ ఇన్స్పెక్టర్ రామ్మూర్తి తెలిపారు శనివారం తాడ్వాయి మండలం లవ్వాలా గ్రామంలో తపాలా శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ సేవలను ఇన్స్పెక్టర్ రామ్మూర్తి సర్పంచ్ మౌనిక ప్రారంభించారు.
అనంతరం వారు మాట్లాడుతూ సేవింగ్ రికవరీ పాలసీ సుకన్య సమృద్ధి యోజన ఉపాధి హామీ నిధులు ఆధార్ నమోదు ఎస్ ఎస్ పి తదితర సేవలను ప్రజలకు నేరుగా అందించనున్నట్లు ఆయన తెలిపారు. స్థానికంగా తపాలకు శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ సేవలు అందించిన ద్వారా ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా ఏర్పడిందని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా తపాలా శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అశోక్ చంద్రకాంత్, నాగేశ్వరావు, సందాని లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.