హుజురాబాద్ పట్టణంలో
భారీ ఎత్తున ఇఫ్తార్ విందు

హుజురాబాద్, ఏప్రిల్ 8 (విశ్వం న్యూస్) : హుజురాబాద్ పట్టణంలో 15 ఉపవాసం రోజు రంజాన్ ఇఫ్తార్ విందు హుజురాబాద్ పట్టణం మురాద్ నగర్ వాడకు చెందిన ముస్లిం సోదరులు ఈరోజు రంజాన్ ఇఫ్తార్ విందుతో పాటు హుజరాబాద్ పట్టణంలో ఉన్న అందరూ ముస్లిం సోదరులకు భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. పట్టణం మున్సిపల్ కౌన్సిలర్లు తోట రాజేంద్రప్రసాద్, తాళ్ల పెళ్లి శ్రీనివాస్, రమేష్ ఆరెపల్లి, సుశీల, టి సదానందం, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చందా గాంధీ, తాళ్లపల్లి రమేష్ గౌడ్, వీరితోపాటు ముస్లిం మైనార్టీ యువ నాయకులు ఎండి యూసుఫ్ ఖాన్, సయ్యద్ మక్సూద్ మహమ్మద్, మన్సూర్ హుస్సేన్ మహమ్మద్, మూషు మహమ్మద్, మురాద్ హుస్సేన్, మహమ్మద్ అషు, మొహమ్మద్ అలీమ్, మహమ్మద్ ఆబిద్, మహమ్మద్ జాకీర్, మహమ్మద్ ఖాజా అలీ, మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, మొహమ్మద్ ముజంబిన్, ఎస్.కె రషీద్, తదితరులు హుజురాబాద్ ముస్లిం మైనార్టీ యువకులు నాయకులు పాల్గొన్నారు.