
- బల్నూరి వెంకట్ కృతజ్ఞతలు తెలిపిన హరీష్ మరియు హరీష్ తల్లి
కమలాపూర్, ఏప్రిల్ 8 (విశ్వం న్యూస్) : డిబార్ ఐన విద్యార్థి హరీష్ విద్యార్థి కి పరీక్షలకు అనుమతి ఇవ్వాలని విద్యాశాఖకు ఆదేశాలు జారి చేసిన హైకోర్టు. హరీష్ అవేధనకు, తల్లి అక్రందనకు అంతం పలికిన హైకోర్టు.
హరీష్ డిబార్ ను రద్దు చేయాలని మొదట మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ కూడా ఒక ప్రకటన మీడియాకు విడుదల చేశారు.
హరీష్ తరుపున అడ్వకేట్ ను ఏర్పాటు చేసి హైకోర్టు లో హౌస్ మోషన్ వేసి హరీష్ విద్యా భవిష్యత్తు ను కాపాడిన బల్మురి వెంకట్ ను అభినందిస్తున్నారు.
ఎట్టకేలకు కమలాపూర్ లో డిబార్ ఐన 10 th విద్యార్థి హరీష్ కు హైకోర్టు న్యాయం చేసింది.
తెలంగాణ విద్యాశాఖ హరీష్ ను అన్యాయంగా 5 సంవత్సరాలు డిబార్ చేస్తే హరీష్ అవేధనను పట్టించుకోని స్థానిక ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మరియు స్థానిక ఎమ్మెల్యే ఈటెల రాజేందర్.