హైదరాబాద్, జూలై 22 (విశ్వం న్యూస్) : పెరిగిన డైట్ చార్జీల ద్వారా… ట్రైబల్ వెల్పేర్, ఎస్సీ వెల్పేర్, బిసి వెల్పేర్ గురుకులాలు, విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాలు తదితర మొత్తం గురుకులాల్లోని దాదాపు 7 లక్షల 50 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనున్నదని సిఎం తెలిపారు.
ప్రస్థుతం అందిస్తున్న చార్జీలకు అదనంగా 26 శాతం చార్జీలు పెరిగాయి. దీనితో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి దాదాపు మరో 237.24 కోట్ల రూపాయల మేరకు అదనపు భారం పడనున్నది.
రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై పడే అదనపు భారాన్ని లెక్కచేయకుండా రాష్ట్రంలో విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో హాస్టల్లల్లో చదువుకుంటున్న విద్యార్థులకోసం సన్నబియ్యంతో అన్నం పెడుతూ వారికి నాణ్యమైన విద్యతో పాటు చక్కటి భోజనాన్ని కూడా ఇప్పటికే అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు మరింత గొప్పగా భోజన వసతులను కల్పించుదుకు అందుకు అనుగుణంగా చార్జీలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని సిఎం స్పష్టం చేశారు.