మంత్రి గంగులకు గాయాలు

- కుప్పకూలిన వేదిక.. కిందపడ్డ మంత్రి, కార్యకర్తలు..

కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 16 (విశ్వం న్యూస్) : తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమాలాకర్కు పెను ప్రమాదం తప్పంది. కరీంనగర్ జిల్లా చెర్లబూట్కూర్ లో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు. సభా వేదిక ఒక్కసారిగా కుప్పకూలడంతో మంత్రి గంగుల సహా ఇతర నేతలు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో మంత్రి గంగుల కాలుకు స్వల్పగాయమైంది. ఇదే సభలో పాల్గొన్న ఓ జడ్పిటీసీ సభ్యుని కాలు విరగడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.