అభివృద్ధి పనులను పరిశీలించిన
మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్

- ఎన్వరాన్మెంటల్ ఇంజనీర్ కు, సానిటరి ఇన్స్పెక్టర్ కు తగిన సూచనలతో సలహాలు
జమ్మికుంట, ఏప్రిల్ 20 (విశ్వం న్యూస్) : జమ్మికుంట పట్టణంలోని వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్ ను, కొత్తపల్లిలో నిర్మిస్తున్న వైకుంఠ ధామం అభివృద్ధి పనులను పరిశీలించారు.
మరియు పట్టణ పరిధిలోని దుబ్బ మల్లన్న దేవస్థానం వద్ద ట్రీ పార్కును సందర్శించారు. వేసవి కాలంలో విపరీత ఎండల దృష్ట్యా, మొక్కలు ఎండిపోకుండా ప్రతి రోజు మొక్కలకు నీళ్ళు పోసి సంరక్షించాలని ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ను ఆదేశించారు.
అలాగే డంపింగ్ యార్డు వద్ద తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా డంప్ చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. పట్టణ పరిధిలోని చెత్తను సేకరించడం, సేకరించిన చెత్తను డంపింగ్ యార్డు కు డంప్ చేయడంపై సానిటరీ ఇన్స్పెక్టర్ కు అందుకు తగిన సూచనతో కూడిన సలహాలు ఇచ్చారు.