పర్లపల్లికి ఐ.ఎస్.ఓ-9001 సర్టిఫికేషన్ ప్రధానం

పర్లపల్లికి ఐ.ఎస్.ఓ-9001
సర్టిఫికేషన్ ప్రధానం

అందుకున్న సర్పంచ్ భారతి-నర్సింహా రెడ్డి
తిమ్మాపూర్, జూన్ 16 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామ పంచాయితీ కి ఐ.ఎస్.ఓ -9001 సర్టిఫికేషన్ ప్రధానం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా హైద రాబాద్‌లోని రవీంద్ర భారతిలో గురువారం జరిగిన పల్లె ప్రగతి దినోత్సవం కార్యక్రమాల్లో భాగంగా అభివృద్ధిలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకుగాను పర్లపల్లి గ్రామ పంచాయితీకి ఐ.ఎస్. ఓ-9001 సర్టిఫికెట్ ను రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారిల చేతులమీదుగా పర్లపల్లి గ్రామ సర్పంచ్ మాదాడి భారతి-నర్సింహా రెడ్డి సర్టిఫికెట్ ను అందుకున్నారు.

కరీంనగర్‌ జిల్లా నుండి ఐ.ఎస్.ఓ-9001 సర్టిఫికెట్ పొందిన తొలి ఏకైక గ్రామపంచాయితీగా పర్లపల్లి గ్రామం చరిత్ర సృష్టించింది. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆద్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధిలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్న పర్లపల్లి, ముఖరాకే గ్రామ పంచాయితీలతో పాటు మరో 27 గ్రామ పంచాయితీలు ఈ సర్టిఫికెట్ లు పొందాయి. ఈ సర్టిఫికెట్ లను ఆయా గ్రామాల సర్పంచ్ లకు అంద జేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట పంచాయితీ రాజ్, గ్రామీణా భివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరి సందీప్ కుమార్ సుల్తానియా, కమీషనర్ హన్మంత రావు బిఆర్ఎస్ ఎల్ పి కార్యదర్శి మాదాడి రమేష్ రెడ్డి, తిమ్మాపూర్ ఎంపీపీ కేతిరెడ్డి వనిత-దేవేందర్ రెడ్డితో పాటు అధికారులు, పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *