రోడ్ల పై ధాన్యం ఆరబోస్తే చట్టపరమైన
చర్యలు:జమ్మికుంట సిఐ రమేష్
- ఛార్జ్ తీసుకున్న వెంటనే ప్రజల ప్రాణాల రక్షణ కోసం చర్యలు
- ప్రథమ బాధ్యత అనేది గ్రామ మొదటి పౌరులైన సర్పంచులదే అని గుర్తు చేసిన సిఐ
జమ్మికుంట, ఏప్రిల్ 12 (విశ్వం న్యూస్) : జమ్మికుంట మండల పరిధిలోని రహదారుల పై రైతులు వారు పండించిన ధాన్యాన్ని రోడ్లపై ఆరబోస్తే కటిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. మంగళవారం జమ్మికుంట పట్టణ పోలీస్ స్టేషన్ లో మండలం లో ని వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లతో సమావేశాన్ని సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ రోడ్ల పై రైతులు ధాన్యం ఆరబోయడం వలన రహదారుల పై ప్రయాణించే ప్రయాణికులు ప్రమాదాలకు గురై ప్రాణాలు పోయిన సంఘటనలు ఉన్నాయని, ఎంతో మంది ప్రయాణికులు తీవ్ర గాయల పాలై అంగవైకల్యం తో జీవితాలు సర్వ నాశనం ఐపోయాయని కావున రైతులు ఎట్టి పరిస్థితుల్లో రోడ్ల పై ధాన్యం ఆరబోయకుండా తగిన అవగాహన రైతులకు కలిగించాలని, ఈ బాధ్యత మొదట మీదే అని వారు అన్నారు. రైతులు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని మరియు ప్రజల ప్రాణాల రక్షణ విషయంలో కటినంగా వ్యవహరిస్తామని అన్నారు. ధాన్యాన్ని రోడ్లపై ఆరబోయకుండా రైతులు సహకరించాలని సి ఐ కోరారు. ఎవరైనా రైతులు ధాన్యం ఆరబోస్తే చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తానని వారు తెలిపారు.