జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా, తబ్ తక్ బాపూ కెసీఆర్ నామ్ రహెగా!!!
జబ్ తక్ సూరజ్ చాంద్
రహేగా, తబ్ తక్ బాపూ
కెసీఆర్ నామ్ రహెగా!!!

అబద్దం దర్జాగా బతికి
ఏదో ఒకరోజు చస్తుంది
నిజం రోజూ చస్తూ
ఏదో ఒకరోజు బతికి
భవిష్యత్తుకి చరిత్రగా మారి
నిత్యం బతుకుతుంది !!!!
హైదరాబాద్, ఏప్రిల్ 22 (విశ్వం న్యూస్): కాంగ్రెస్ అనే అబద్దం నేడు దర్జాగా బతుకుతున్నానని మిడిసిపడుతుంది. కానీ ఏదోరోజు శాశ్వతంగా చస్తుందని దానికి తెలియదు. బిఆర్ ఎస్ ను చంపానని వాడు కలలు కంటున్నాడు. బిఆర్ ఎస్ అనేది ఒక నిజం, “నిజం”కు చావు ఉండదని వాడికి తెలియదు.
మాబాపు కేసిఆర్ నేడు గద్దెపై లేకపోవచ్చు…జనంలో ఉన్నాడు. జనంనుండి మళ్ళీ గద్దెనెక్కుతాడు.
ఇది తెలంగాణ ప్రజల శాసనం !!!

తెలంగాణ చరిత్ర గతిని మార్చిన మహానాయకుడు మాబాపు కేసిఆర్. ముప్పేటదాడిని తిప్పికొడుతూ అద్భుత విజయాన్ని తెలంగాణ ప్రజలకందించిన బాపును చరిత్ర ఎలా మరచిపోగలదు? అరవైఏళ్ళ ప్రజల స్వప్నాన్ని సాకారం చేసిన మహనీయుడు బాపు కేసిఆర్ పేరు తెలంగాణ చరిత్రలో అజరామరంగా నిలిచిపోతుంది. తమ ఆర్థిక దోపిడిని,సాంస్కృతిక ఆధిపత్యాన్ని,మీడియా ఆధిపత్యాన్ని,పాలనాధిపత్యాన్ని కూలదోశాడని పగ పెంచుకున్న వలస దోపిడిదారులంతా ఏకమై బాపు కేసిఆర్ ను నామరూపాలు లేకుండా చేయాలనుకుంటున్నారు!!!
డబ్బుసంచులు వెదజల్లి తమ కట్టు బానిసను గద్దెపై కూర్చోబెట్టారు. కిరాయి మెధావులతో వెకిలిరాతలు రాయిస్తున్నారు. బూతులు తిట్టిస్తున్నారు. అవినీతి ముద్ర వేస్తున్నారు. తెలంగాణను వ్యతిరేకించిన శత్రువులంతా నేడు బాడుగ పాలకుడిని చూసి పరవశించిపోతున్నారు. వాడు ఇచ్చిన హామీని ఒక్కటికూడా నెరవేర్చకపోయినా ఆహా ఓహో అంటూ పొగిడేస్తున్నారు!!!
తెలంగాణ వ్యతిరేకులంతా వాడి భజన చేస్తున్నారంటేనే..వాడు ఎవరి ప్రయోజనంకోసం పనిచేస్తున్నాడో అర్థంచేసుకోవచ్చు. ఎల్లోమీడియా ఇచ్చిన ఎజండాను వాడు అమలు చేస్తున్నాడు. కేసిఆర్ అనే పేరును లేకుండా చేస్తానంటున్నాడు. కేసిఆర్ అనే పేరు లేకుండా చేయాలంటే తెలంగాణను లేకుండా చేయాలి.
అవును!వాడు తెలంగాణ అనే అస్థిత్వాన్నే లేకుండాచేసే ప్రయత్నం చేస్తున్నాడు.
మన వనరులన్నీ తనను గద్దెనెక్కించిన సీమాంధ్ర పచ్చ యజమానులకు అప్పజెప్పే హిడెన్ ఎజండాతో వాడు సిద్దంగా ఉన్నాడు!!!
ఇప్పటికే కృష్ణానదిని వాళ్ళకు అప్నజెప్పాడు. డెల్టాలో కమ్మ సంపన్నులకు మూడోపంటకు నీళ్ళిచ్చే పనిలో ఉన్నాడు. మన బీళ్ళు ఇక నోరు తెరువాల్సిందే. ఇంతేకాకుండా తెలంగాణను సాధించిన నాయకుడిపై అవమానకరంగా మాట్లాడుతున్నాడు. ఈ బజారునాయాలు బజారు భాష మాట్లాడినా..ఎల్లోమీడియా యధాతధంగా ప్రచురించి,ప్రసారంచేసి శునకానందం పొందుతుంది. రామన్న,హరీషన్నలపై కూడా వాడు చౌకబారు భాష ప్రయోగిస్తున్నాడు!!!
ఎల్లోమీడియా మేనేజ్ మెంట్ కోటలో గద్దెనెక్కినోడు కాబట్టి… వాడికి అందరూ మేనేజ్ మెంట్ కోటాలో ఎక్కినట్టుగానే కనబడుతారు. మొన్న ఒక జాతీయ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా వాడు మన కేటిఆర్ అన్నపై విషంకక్కాడు. మేనేజ్మెంట్ కోటలో వచ్చాడని మన రామన్న ను చులకనగా మాట్లాడాడు!!!!

కేటిఆర్ అన్న నాలుగైదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, ఉద్యమం నుండి ఎదిగాడు. ఆయన మేనేజ్మెంట్ కోటలో వచ్చినట్టు ఎట్లవుతుందో ఆ మూర్ఖుడే చెప్పాలి. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మా రామన్నది మేనేజ్మెంట్ కోటా అయితే… ఇంతవరకు ఒక్కసారికూడా గెలువని వీడి చిన్న యజమాని లోకేష్ ఏ కోటాలో వచ్చినట్టో వీడే చెప్పాలి. మా బాపు కేసిఆర్ ను ప్రజలు ఓడించలేదు,స్థానిక నాయకుల తప్పిదాలవల్లే ఓడిపోయాడని తెలుసుకోవాలి!!!!
మూడోసారికూడా కేవలం ఒక్కశాతం ఓట్ల తేడాతోనే ఓడిపోయామనే సంగతి మరచిపోకూడదు.
ఈ బుడ్డర్ ఖాన్ పై ఉన్న భ్రమలు మూడునెలల్లోనే తొలగిపోయాయి. ప్రజలు నిజం తెలుసుకుంటున్నారు.
బాపు ను ఓడించినందుకు పశ్చాత్తాప పడుతున్నారు. రైతుబందు, రైతుభీమా, కళ్యాణలక్ష్మిలాంటి పథకాలను కోల్పోయామని కుమిలిపోతున్నారు. ఇకనుండి వచ్చే ఎన్నిక ఏదైనా మా ఓటు బాపు కేసిఆర్ కే అని డిసైడ్ అయ్యారు.
జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా, తబ్ తక్ బాపూ కెసీఆర్ నామ్ రహెగా!!! (సూర్యచంద్రులు ఉన్నంత కాలం బాపు కేసీఆర్ పేరు నిలిచి ఉంటుంది!!!)
