సీఎం సహాయ నిధికి రూ.130 కోట్ల
విరాళం ప్రకటించిన
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ
- తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పక్షాన వరద బాధితులకు 130 కోట్ల రూపాయలు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒకరోజు మూలవేతనం ఇవ్వడానికి తీర్మానం చేయటం జరిగిందని టిసిటిఎన్జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వెల్లడి.
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదల కారణంగా అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. మూడు రోజులు కురిసిన వర్షాల వలన, వరదల వలన ప్రజలు ప్రాణాలు కోల్పోయినారు వేలకోట్లలో ఆస్తి నష్టం జరిగింది. రైతులు కూడా చాలా నష్టపోయారు.
ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులుగా తన వంతు సహాయం అందజేయవలసిన అవసరం అని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మన తెలంగాణ ఉద్యోగుల పక్షాన మనం ఇచ్చే సహాయం వారికి కొంత వరకు తీర్చిన వారవుతాం ప్రజలలో మన ఉద్యోగుల పట్ల కూడా గౌరవం పెరుగుతుంది.
తెలంగాణ పేద ప్రజలకు రైతులకు అన్ని రకాలుగా వర్షాకాలంలో వరదలు రావడం వలన వస్తువులు, తొడుక్కోవడానికి బట్టలు, వండుకొని తినడానికి ఉన్న ధాన్యం బియ్యం ప్రతి ఒక్కటి వరదల వలన కోల్పోయిన వారికి మన వంతు సహాయం చేసిన వారు వారవుతాం.
తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న అన్ని క్యాటగిరిలకు సంబంధించిన ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, అన్ని రకాలుగా నష్టపోయిన వారికి మన వంతు కొంతవరకు ఆదుకున్న వారవుతారు కనుక ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా తెలంగాణ ఉద్యోగుల పక్షాన జెఎసి తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు స్వాగతించాలని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్ర స్థాయి జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, జనరల్ సెక్రెటరీ ఏలూరి శ్రీనివాసరావు, అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగ సంఘ నాయకులు కలిసి తీర్మానించిన తీర్మానానికి ప్రతి ఒక్క ఉద్యోగి సంపూర్ణముగా మద్దతు ఇవ్వవలసిన బాధ్యత ప్రతి ఒక్క ఉద్యోగిపై ఉందని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు.
తెలంగాణలో అన్ని శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన ఒకరోజు మూల వేతనం దాదాపుగా 130 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయ నిధికి ఇవ్వడానికి తీర్మానించిన పత్రాన్ని ఈరోజు హైదరాబాద్ కేంద్ర టీఎన్జీవోస్ భవనములో విడుదల చేసినారని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఈరోజు పత్రిక విలేకరుల సమావేశంలో తెలియజేసినారు.