ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై సీఎంకు వినతి పత్రం అందజేసినా మారం జగదీశ్వర్

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై
సీఎంకు వినతి పత్రం
అందజేసినా మారం జగదీశ్వర్

హైదరాబాద్, మార్చి 11 (విశ్వం న్యూస్) : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేసినా తెలంగాణ రాష్ట్ర స్టేట్ టీఎన్జీవోస్ అధ్యక్షులు మారం జగదీశ్వర్. వినతి పత్రంలో తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, ఆర్థిక శాఖలో పెండింగ్ లో ఉన్న అన్ని రకాల ఉద్యోగులకు సంబంధించిన బిల్లులు, సరెండర్ లీవ్, జిపిఎఫ్, మెడికల్ బిల్, హౌస్ అంబులెన్స్ బిల్లులు ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ప్రైవేటు వెహికల్ యజమానులకు సంబంధించిన బిల్లులు, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నుండి విడిపోయినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు మిగిలిపోయి ఉన్న వారిని తిరిగి తెలంగాణ రాష్ట్రానికి రప్పించాలని, తెలంగాణ రాష్ట్రంలో నూతనముగా ఏర్పడిన జిల్లాలలో అన్ని ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను అన్నిటిని వెంటనే భర్తీ చేయాలని, వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన ప్రమోషన్లు కూడా వెంటనే ఇవ్వాలని, అన్ని ప్రైవేట్ హాస్పటల్లో హెల్త్ కార్డు అమలైనట్లు చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ ఉద్యోగులకు రెండో పిఆర్ సి లో ఐ ఆర్ 5% నుండి 20% పెంచాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర టీఎన్జీవోస్ అధ్యక్షులు మారం జగదీశ్వర్ అందించినట్లు తెలంగాణ స్టేట్ టి సి టి ఎన్జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలియజేశారు.

సమస్యలను సీఎం దృష్టికి తీసుకొని వచ్చినందుకు జగదీశ్వర్ కు అభినందనలు
తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ పత్రిక సమావేశంలో మాట్లాడుతూ దాదాపు పది సంవత్సరాలు నుండి ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమస్యలు గత ప్రభుత్వంలో ఎవరు కూడా పట్టించుకోలేదు అప్పటినుండి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కారం కాకుండా ఉండే ఆ సమస్యల పరిష్కారం కొరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు, క్యాబినెట్ మంత్రులు డి శ్రీధర్ బాబు సమక్షంలో జరిగిన ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమావేశానికి ముఖ్యఅతిథిగా వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తెలంగాణ రాష్ట్ర టీఎన్జీవోస్ అధ్యక్షులు మారం జగదీశ్వర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 317 జీవో మరియు ఉద్యోగులకు రావాల్సిన మూడు డిఏలు, ఉద్యోగులకు ఐఆర్ ఎక్కువ ఇవ్వాలని అలాగే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్మెంట్ ఎక్కువ ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఉద్యోగుల పట్ల చొరవ తీసుకోవాలని, ఇది మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతాయని మాకు 100% నమ్మకం ఉందన్నారు.

అందుకే ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలలోపే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమస్యలపై ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగులకు సంబంధించిన అన్ని రకాల సమస్యల కొరకు రెండు గంటల సమయం కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డి శ్రీధర్ బాబుకి, ప్రొఫెసర్ కోదండరాం సమక్షంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు అన్నిటిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి సమస్యలు తీసుకొని వచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సంఘం పక్షాన తెలంగాణ రాష్ట్ర టీఎన్జీవోస్ అధ్యక్షులు మారం జగదీశ్వర్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

తెలంగాణ రాష్ట్ర నూతన టీఎన్జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా మారం జగదీశ్వర్ ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టినందుకు వారికి ప్రత్యేక అభినందనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *