జమ్మికుంట:ఎలక్ట్రిక్ వాహన
షోరూం ప్రారంభించిన సి.ఐ రమేష్
జమ్మికుంట, మే 18 (విశ్వం న్యూస్) : జమ్మికుంట పట్టణంలో బుదవారం శ్రీ సాయి ఎలక్ట్రిక్ వాహన నూతన షోరూంను పట్టణ సి.ఐ రమేష్ ప్రారంభించారు. పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నతరుణంలో సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని జమ్మికుంటలో నూతన ఎలక్ట్రిక్ వాహన షోరూంను ప్రారంభించామని వారు తెలిపారు.
ఒక గంట విద్యుత్ ఛార్జింగ్ తో 100 కి.మీ. ప్రయాణం చేయవచ్చని దీనికి సుమారు రూ: 10 నుండి 15 ఖర్చు అవుతుంది అని తెలిపారు. శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యo లేకుండా కాలుష్య నియంత్రణకు దోహద పడటమే కాకుండా పర్యావరణానికి మేలు జరుగుతుందని తెలిపారు. ఎక్చేంజ్ సౌకర్యం, లోన్ సౌకర్యం ఉందని అతి తక్కువ డౌన్ పేమెంట్ తో సామాన్యులకు అందుబాటులో స్వంత వాహన సౌకర్యం కల్పిస్తున్నాం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పట్టణం సి.ఐ రమేష్, ఎస్.ఐ అహ్మద్, పి.ఎస్.సి.ఎస్ చైర్మన్ పోనగంటి సంపత్, పోల్సాని సమ్మరావు, షోరూం యాజమాన్యం మార్త తిరుపతి, అబ్బిడి తిరుపతి రెడ్డి, మేకల రాజిరెడ్డి, జక్కుల రాజు తదితరులు పాల్గొన్నారు.