జమ్మికుంట:దశాబ్ది ఉత్సవాలు ఉవ్వెత్తున ఎగిసిపడాలి

దశాబ్ది ఉత్సవాలు
ఉవ్వెత్తున ఎగిసిపడాలి

  • ఉత్సవాలలో హుజురాబాద్ నియోజకవర్గం ముందుండేలా సమిష్టి కృషితో సఫలం చేద్దాం: ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి

జమ్మికుంట, మే 30 (విశ్వం న్యూస్) : దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై జమ్మికుంట పట్టణ పరిధిలోని వినాయక గార్డెన్ ఫంక్షన్ హాల్ లో నియోజక వర్గంలోని అధికారులు, ప్రజా ప్రతినిదులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తొమ్మిదీళ్ళ కాలంలో గొప్ప సంస్కరణలతో తెలంగాణ రాష్ట్రం శుభీక్షంగా మారినా సందర్భంగా తెలంగాణను ఉత్సవాలతో ముంచేత్తుదాం అని అన్నారు.

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రతిశాఖ ద్వారా తొమ్మిదేళ్ళలో సాధించిన ప్రగతి గురించి వివరించాలని అలాగే జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు పతాక ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని, జూన్ 3న వ్యవసాయ, ఉద్యాన, మత్య, అనుబంధ వ్యవసాయ శాఖల క్లస్టర్ లలో ఉన్న రైతు వేదికల్లో కార్యక్రమం నిర్వహించాలని, జూన్ 4న పోలీస్ శాఖ ద్వారా సురక్షా దినోత్సవం, జూన్ 5న విద్యుత్ దినోత్సవం, జూన్ 6న తెలంగాణ పారిశ్రామిక ప్రగతి దినోత్సవం, జూన్ 7న సాగునీటి దినోత్సవం, జూన్ 8న ఊరూరా చెరువుల పండగ, జూన్ 9న తెలంగాణ సంక్షేమ సంబరం, జూన్ 10న తెలంగాణ సుపరిపాలన దినోత్సవం, జూన్ 11న తెలంగాణ సాహిత్య దినోత్సవం, జూన్ 12న తెలంగాణ రన్ (మారథాన్), జూన్ 13న తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం, జూన్ 14న తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవం, జూన్ 15న తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం, జూన్ 16న తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం, జూన్ 17న గిరిజన దినోత్సవం, జూన్ 18న మంచి నీళ్ళ పండగ, జూన్ 19న తెలంగాణ హరితో త్సవం, జూన్ 20న తెలంగాణ విద్యా దినోత్సవం, జూన్ 21న తెలంగాణ అధ్యాత్మిక దినోత్సవం, జూన్ 22న తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు.

నియోజకవ్గంలోని మండలాలు , గ్రామాలలో తెలంగాణ ఆవిర్భవించిన తొమ్మిదేళ్లలో సాధించిన ప్రభుత్వ ప్రగతి గురించి వివరించాలని చెప్పారు. ప్రతి కార్యక్రమానికి ప్రతి గ్రామం నుండి సుమారు 1000 మంది నుండి 1500 మంది హాజరయ్యేలా అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆయన తెలిపారు. ప్రభుత్వ కార్యలయాలను, ప్రత్యేక ప్రదేశాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని, మహిళలు బతుకమ్మలతో లేదా బోనాలతో పండగలను తలపించే విధంగా, డప్పు చప్పుళ్ళతో అంగరంగ వైభవంగా ప్రతి కార్యక్రమం ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, ఎస్.సి కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కె.డి.సి.సి బ్యాంక్ వైస్ చైర్మన్ పింగలి రమేష్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వర్ రావు, జమ్మికుంట జెడ్.పి.టి.సి శ్రీరామ్ వెంకట్ స్వామి, హుజురాబాద్ అర్.డి.ఓ హరిసింగ్, హుజురాబాద్ నియోజకవర్గంలోని సర్పంచులు, హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంట, కమలాపూర్, వీణ వంక మండలాల ఎం.అర్.ఓ లు, ఎం.పి.డి.ఓ లు, విద్యుత్, ఇరిగేషన్ శాఖ అధికారులు, నియోజక వర్గంలోని ఎం.పి.టి.సి లు, పి.ఏ.సి.ఎస్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *