జమ్మికుంట:ఈటలను ఓడించే
సత్తా నాకే ఉంది:సమ్మిరెడ్డి
- చిల్లర రాజకీయాలు మానుకోండి టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు సమ్మిరెడ్డి
జమ్మికుంట, జూలై 8 (విశ్వం న్యూస్) : టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి జమ్మికుంటలోని తన నివాసంలో మీడియా సమావేశo నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత లేని నాయకులు చిల్లర రాజకీయాలు చేయవద్దని హెచ్చరించారు. హుజరాబాద్ నియోజకవర్గంలో పార్టీ ఇంచార్జి వల్ల బీఆర్ఎస్ పార్టీ కి ఆదరణ తగ్గుతుందని పార్టీ అధిష్టానానికి లేఖ రాసి ఈ నెల 6న మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీకి ప్రభుత్వ విప్ గా ఉన్నత హోదా కల్పించి నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించారని, అతని ప్రవర్తన వల్ల ప్రజలు, పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, దీనివల్ల పార్టీ ఆదరణ కోల్పోతుందని చెప్పినట్లు గుర్తు చేశారు.
దీనిని అపార్థం చేసుకొని కొందరు నాయకులు ఆవాకుల సేవాకులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత లేని నాయకులు ఇస్టారీతిలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుని నుంచి షోకాజ్ నోటీసు వచ్చింది వాస్తవమేనని దానికి నేను అధిష్ఠానానికి వివరణ ఇచ్చుకుంటానని తెలిపారు.
కానీ తనపై అవాక్కులు చేవాక్కులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీకి ఎవరు కోవర్ట్ లుగా వ్యవహరిస్తున్నారు, ఎవరు అక్రమాలు, కబ్జాలు చేస్తున్నారు, తన వద్ద పూర్తి చిట్కా ఉందని హెచ్చరించారు. చిల్లర రాజకీయాలు మానుకొని పార్టీ ప్రతిష్టకు పాటుపడాలని కోరారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం ఇస్తే 2023లో ఈటల రాజేందర్ ను ఓడించే సత్తా నాకే ఉంది టికెట్ ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.