బాయ్‌ఫ్రెండ్‌తో శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్

బాయ్‌ఫ్రెండ్‌తో శ్రీవారిని
దర్శించుకున్న జాన్వీ కపూర్

తిరుపతి ఏప్రిల్ 3 (విశ్వం న్యూస్) : డేటింగ్ పుకార్ల మధ్య, నటి జాన్వీ కపూర్ సోమవారం తిరుపతి బాలాజీ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా శిఖర్ పహారియాతో ముచ్చటించారు. జాన్వీ సోమవారం ఉదయం తిరుమల చేరుకున్న జాన్వీ.. వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసింది. అనంతరం ఆలయ పండితులు ఆమెకు వేదాశీర్వచనం అందించగా, అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఆమెతో పాటు తన ప్రియుడు శిఖర్ మరియు సోదరి ఖుషీ కపూర్ కూడా ఉన్నారు. జాన్వీ మరియు ఆమె సోదరి సాంప్రదాయక హాఫ్ చీర ధరించారు. శిఖర్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *