కాంగ్రెస్ లో చేరిన
ఎమ్మెల్యే దానం

హైదరాబాద్, మార్చి 17 (విశ్వం న్యూస్) : బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్… కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనే కాకుండా… చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఏఐసీసీ ఇంఛార్జి దీపా దాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వీరు పార్టీలో చేరారు.
- పాపం.. బీఆర్ఎస్…
- బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా బీఆర్ఎస్కు రాజీనామా చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే దీపదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఇటీవల సీఎంతో భేటీ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా హస్తం కండువా కప్పుకున్నారు.