చేవెళ్ల:బీఆర్ఎస్‌కు
ఎంపీ రంజిత్ రెడ్డి గుడ్‌బై..

హైదరాబాద్, మార్చి 17 (విశ్వం న్యూస్) : చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యoలో తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశానని ఎక్స్‌లో వెల్లడించారు. ఈమేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రాజీనామా లేఖను పంపారు.

చేవెళ్ల ప్రజలకు సేవ చేసేందుకు ఇప్పటివరకు అవకాశం కల్పించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ గౌరవ అధ్యక్షులు కేటీఆర్‌కు రంజిత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో చెవేళ్ల నుంచి మళ్లీ రంజిత్‌రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తారనే ప్రచారం జరిగింది. కాని ఆయన కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.