జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలి

జూనియర్ పంచాయతీ
కార్యదర్శులను రెగ్యులర్ చేయాలి

సమ్మె నోటీసు అందజేసిన జూనియర్ కార్యదర్శులు
ములుగు, ఏప్రిల్ 15 (విశ్వం న్యూస్) : గత నాలుగు సంవత్సరాలుగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా కొనసాగుతున్న వారిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు బి సారయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . శనివారం జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య కు సమ్మె నోటీసు అందజేశారు . అనంతరం సారయ్య మాట్లాడుతూ నాలుగేళ్ల ప్రొఫెషన్ పీరియడ్ పూర్తి చేసుకున్నందున జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.

మూడేళ్ల ప్రొబేషన్ పీరియడ్ తో విధుల్లో చేరిన తమకు ప్రభుత్వం GO.NO 26 తో మరో ఏడాది పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 12 నాటికి నాలుగేళ్లు పూర్తి చేసుకున్నామని ఆయన వివరించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.లేనియెడల ఈనెల 28వ తేదీ నుండి నిరవధిక సమ్మె చెప్పటనన్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

వినతి పత్రం ఇస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *