- వీరి ఆందోళనకు ప్రతిపక్ష
కాంగ్రెస్, బీజేపీ మద్దతు - జేపీఎస్‌లను వెంటనే
రెగ్యులరైజ్ చేయాలి - సీఎం కేసీఆర్‌కు
రేవంత్ బహిరంగ లేఖ
హైదరాబాద్, మే 9 (విశ్వం న్యూస్) : జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెపై ఆగ్రహంతో ఉన్న తెలంగాణ ప్రభుత్వం వారికి నిన్న నోటీసులు జారీ చేసింది. మే 09వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు విధుల్లో చేరాలని అల్టిమేటం జారీ చేసింది. సమ్మె విరమించి విధుల్లో చేరాలని ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ ముగిసినప్పటకీ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు వెనక్కి తగ్గలేదు. ఈ రోజు సాయంత్రం 5 గంటలలు దాటిన సమ్మె కొనసాగిస్తున్నారు. వీరి ఆందోళనకు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ మద్దతు తెలిపాయి.
జేపీఎస్‌లను వెంటనే రెగ్యులరైజ్
చేయాలి:టీపీసీసీ రేవంత్ రెడ్డి
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని టీపీసీసీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన ఆయన.. వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలన్నారు. లేనిపక్షంలో వారి పక్షాన పోరాటానికి దిగుతామని హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డలు వెనుక వారి కృషి ఉందని.. పగలు రాత్రి తేడా లేకుండా వారితో పని చేయించుకున్నారని అన్నారు.