వరంగల్ బిఆర్ఎస్
అభ్యర్థిగా కడియం కావ్య
- చేవెళ్ల మరియు వరంగల్ పార్లమెంటు స్థానాల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు
హైదరాబాద్, మార్చి 13 (విశ్వం న్యూస్) : వరంగల్ లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు టికెట్ కేటాయించారు. ఈ మేరకు పార్టీ అధినేత ఆమె పేరును ప్రకటించారు. బుధవారం హైదరాబాద్ లో వరంగల్ ఎంపీ స్థానంపై కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
అయితే నేతలంతా అరూరి రమేష్ ను అభ్యర్థిగా ప్రతిపాధించగా అతడు నో చెప్పడంతో కేసీఆర్ వరంగల్ కు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, నాయకులతో చర్చించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
అలాగే చేవెళ్ల నియోజకవర్గం నుంచి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్‌కు టికెట్ కేటాయించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలకు పార్టీ ఆఫీస్ నుంచి సమాచారం అందజేశారు. కాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మరో స్తానమైన మహబూబాబాద్ ఎంపీ స్థానాన్ని సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవితకే కేటాయించారు.