కరీంనగర్:సమాధానం
చెప్పకుండా అరెస్టులా

- ప్రతి పక్షాల గొంతు నొక్కినంత మాత్రాన ప్రజల కళ్ళు కట్టలేరు
- ఉదయం నాలుగు గంటల నుండి పోలీసు కస్టడీలో ఉంచారు
- నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కరీంనగర్ బ్యూరో, జూన్ 21 (విశ్వం న్యూస్) : మంత్రి కేటీఆర్ సంవత్సరం క్రితం మార్చి నెలలో కరీంనగర్ ప్రజలకు 24/7 నల్లా నీళ్ళిస్తామని శిలాఫలకం శంకుస్థాపన చేసి ఇంతవరకు పనులు ప్రారంభించకపోగా రోజుకు కనీసం అరగంట కూడా నీళ్ళు ఇవ్వడం లేదని కరీంనగర్ వస్తున్న కేటీఆర్ కరీంనగర్ ప్రజలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసిందని,సమాధానం చెప్పలేక ఉదయం నాలుగు గంటల నుండి పోలీసుల ద్వారా అరెస్టు చేయించి ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. ఉదయం నుండి సాయంత్రం కేటీఆర్ వెల్లేంత వరకు పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో ఉంచారని నరేందర్ రెడ్డి అన్నారు.

ప్రతి పక్షాల గొంతు నొక్కినంత మాత్రాన ప్రజల కళ్ళు కట్టలేరని ప్రజలు స్వయంగా అనుభవిస్తున్నారు కాబట్టి తగిన సమయంలో ప్రజలు బుద్ది చెబుతారని అన్నారు. అరెస్టయిన వారిలో గుండాటి శ్రీనివాస్ రెడ్డి, శ్రవణ్ నాయక్, ధన సింగ్ ,షబానా మహమ్మద్, అన్న జ్యోతి రెడ్డి, ఊరెడి లతా, ముల్కల కవిత, నేన్నెల పద్మ, ఎగిడి శారద, మహాలక్ష్మి, నెల్లి నరేష్ ,ముక్క భాస్కర్, ఎజ్రా దేవ్ ,షేక్ షేహన్షా, మామిడి సత్యనారాయణ రెడ్డి, జీడి రమేష్, అష్రాఫ్, మెతుకు కాంతయ్, కాంపల్లి కీర్తి కుమార్, జిలకర రమేష్, భారీ, ఇమామ్, కమల్ కత్రి, అజ్మత్, అనీఫ్, సోహెల్, ముల్కల యోనా, బషీర్, సిరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.