కరీంనగర్:భజరంగ్ దళ్ నిషేధంపై భగ్గుమన్నబీజేపీ
కరీంనగర్:భజరంగ్ దళ్
నిషేధంపై భగ్గుమన్నబీజేపీ

- హనుమంతున్ని కీర్తించడం.. ప్రార్థించడం నేరమా..?
- ఓవర్గం మెప్పుకోసం బజరంగ్ దళ్ ను బ్యాన్ చేస్తామని ప్రకటించడం సిగ్గుచేటు..
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి వ్యాఖ్యలు
కరీంనగర్ బ్యూరో, మే 5 (విశ్వం న్యూస్) : కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే బజరంగ్ దళ్ ని నిషేధిస్తామన్న ప్రకటనపై కరీంనగర్ బీజేపీ శ్రేణులు భగ్గుమన్నారు. కర్ణాటకలో భజరంగ్దళ్ ను నిషేధిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన నిర్ణయాన్ని ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకుజిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కరీంనగర్ పద్మనగర్ లోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమానికి బయలుదేరిన బిజెపి శ్రేణులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు . అంతకుముందు బిజెపి నాయకులు కార్యకర్తలు , శాంతియుతంగా కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ లో హనుమాన్ చాలీసా పారాయనం చేపట్టారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ హనుమంతున్ని ప్రార్థించడం, కీర్తించడం కాంగ్రెస్ పార్టీకి తప్పుగా మారిందని , అందుకే హనుమంతున్ని ఆరాధించే బజరంగ్ దళ్ ను నిషేధిస్తామని కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో సిగ్గు లేకుండా ప్రకటన చేసిందన్నారు.

బజరంగ్ దళ్ ఏమైనా తీవ్రవాద సంస్థనా..?నిషేధం విధించడానికి ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు . హిందువుల ఆరాధ్య దైవం కోసంహిందూ ధార్మిక సంస్థగా హిందూ ప్రజానీకం కోసం ధార్మిక, దైవ కార్యక్రమాలు చేపడుతున్న బజరంగ్ దళ్ సంస్థ పై కాంగ్రెస్ పార్టీ అనవసరంగా విషంకక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ హిందువుల మనోభావాలను గుర్తించలేని స్థితిలో ఉందని , మైనార్టీ సంతుష్టికరణ విధానాలను అవలంబిస్తూ ఓవర్గం మెప్పుకోసం, ఓట్ల కోసం పడరాని పాట్లు పడుతూ హిందూ ఆధ్యాత్మిక ధార్మిక సంస్థలనే బ్యాన్ చేసే దుస్థితికి వచ్చిందన్నారు. ఆ దిశలోనే బజరంగ్దళ్ పై కాంగ్రెస్ పై విద్వేషం పెంచుకొని, కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన వెంటనే బ్యాన్ చేస్తామని ప్రకటన చేయడం దారుణమన్నారు. హిందువుల దైవం హనుమాన్ విశిష్టత కార్యక్రమ నిర్వహణ కోసం పనిచేస్తున్న బజరంగ్దళ్ ను నిషేధించడానికి కారణాలేంటో కాంగ్రెస్ నాయకత్వం స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీ హిందువుల మనోభావాలతో అనేక ఆటలాడుతుందని , దేశవ్యాప్తంగా ఇతర వర్గాల కోసం మెప్పుకోసం ఓట్ల కోసం పడరాని పాట్లు పడిందని , ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో కూడా అదే పనిచేస్తుందని , అందుకే బజరంగ్దళ్ ను నిషేధిస్తామని సిగ్గు లేకుండా ప్రకటన చేసిందన్నారు. హిందువుల మనోభావాలను గుర్తించకుండా ఆటలాడుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని , హిందువుల సంగటితశక్తి , హనుమాన్ శక్తి ఏంటో కాంగ్రెస్ కి రుచి చూపిస్తామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ డి.శంకర్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కళ్లెం వాసుదేవ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు సాయిని మల్లేశం ఎర్రబెల్లి సంపత్ రావు, జిల్లా కార్యదర్శి మంజుల వాణి నాయకులు పుప్పాల రఘు, గడ్డం నాగరాజ్, సొల్లు అజయ్ వర్మ, సుధాకర్ పటేల్, జాడి బాల్ రెడ్డి, దుబాల శ్రీనివాస్, ముత్యాల జగన్ రెడ్డి, పాదం శివరాజ్, కోల అశోక్, లడ్డు ముందాడ, ధీరజ్, శ్రీకాంత్, గణేష్, మొండయ్య, వేణు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
