కరీంనగర్:మహిళల కారణంగానే
జిల్లా అన్ని రంగాల్లో ముందు

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
కరీంనగర్ బ్యూరో, జూన్ 13 (విశ్వం న్యూస్) : రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు జిల్లాలో అమలు చేస్తున్న కార్యక్రమాలు విజయవంతమవుతు అన్ని రంగాల్లో ముందుందంటే అందుకు ప్రధాన కారణం మహిళలేనని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గోపికృష్ణ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మహిళా సంక్షేమ దినోత్సవంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ ముఖ్య అతిధిగా పాల్గోన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అంగన్ వాడి కార్యకర్తగా, బిఎల్ఓగా, వివిధ శాఖలలో పలు హోదాలలో అత్యుత్తమ బాద్యతలను నిర్వహిస్తు, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లడంతో పాటు వాటిని విజయవంతం చేయడంలో మహిళలు ప్రధానపాత్రను పోషిస్తున్నారని తెలిపారు. పురుషులు ఒకే విధమైన ఆఫీస్ బాద్యతలను ఉదయం నుండి సాయoత్రం వరకు నిర్వహిస్తే, మహిళలు మాత్రం ఉదయం లేచింది మొదలు తిరిగి నిద్రపోయె వరకు తల్లిగా, భార్యగా, గృహిణిగా ఇంట్లో, ఉద్యోగిణిగా ఆఫీసులో విధులు నిర్వహిస్తునే ఉంటారని మనకోసం అనునిత్యం శ్రమిస్తున్న మహిళల పట్ల కొందరు చులకన భావాన్ని చూపిస్తున్నారని దానిని మానుకోవాలని సూచించారు.

అత్యుత్తమ సేవలను అందిస్తున్న మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతోందని తెలిపారు. తెలంగాణ ఆవిర్బావం నుండి కరీంనగర్ జిల్లాలోని 172 అంగన్ వాడి కేంద్రాలలో ఆరోగ్యలక్ష్మీ పథకం ద్వారా గర్బీణీలు, బాలింతలకు ప్రతిరోజు పప్పు, ఆకుకూరలు, గుడ్డు, పాలతో సంపూర్ణ బోజనాన్ని అందించడంతో పాటు ఐరన్ ఫోలిక్ యాసిడ్, కాల్షియం మాత్రలను పంపిణి చేయడం జరుగుతుందని తెలిపారు. పౌష్టికాహార లోపంతో పిల్లలు ఉండకూడదని మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలకు ప్రతిరోజు గుడ్డు మద్యాహ్నం బోజనం, స్నాక్స్ అందించడం జరుగుతుందని 7 నెలల నుండి మూడు సంవత్సరాల వయస్సు గల పిల్లలకు బలవర్దకమైన బాలామృతం, కోడి గుడ్డు, బాలామృత్తం ప్లస్ తీవ్రపోషణ లోపం ఉన్న పిల్లలకు అందిండం జరుగుతుందన్నారు. మహిళలు సంపూర్ణ అరోగ్యంతో మెదలాలని ఆరోగ్యమహిళా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి 8 రకాల వ్యాదులకు వైద్యసేవలను అందించడం జరుగుతుందని తెలిపారు. మార్కెట్ కమిటిలో కూడా రిజర్వేషన్లను అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. 2014-15 నుండి 2023 వరకు 15,900 మంది స్వయం సహాయక సంఘాలకు వడ్డిలేని ఋణాలను మంజూరు చేయడం జరుగుతుందన్నారు.
జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పోన్నం అనీల్ కుమార్ మాట్లాడుతూ మహిళాసాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతూ తెలంగాణ ప్రభుత్వం అందరికి ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. తెలంగాణలోనే ప్రప్రథమంగా కరీంనగర్ జిల్లాలో జిల్లా మహిళా లైబ్రరీని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ నిర్ణయించారని దీనిని జిల్లాలోని మహిళా సంఘ భవనంలో ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ 20 న తెలంగాణ విద్యాదినోత్సవం నాడు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరానికి కరీంనగర్ నియోజకవర్గంలోని 762 స్వశక్తి సంఘాలకు బ్యాంకులింకేజి ద్వారా (66,99,29,000) అరవై ఆరు కోట్ల తోంబై తోమ్మిది లక్షల ఇరువై తోమ్మిది వేల చేక్కును, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా కరీంనగర్ నియోజక వర్గంలోని 29 స్వయం సహాయ సంఘాలకు బ్యాంకు లింకేజి ద్వారా మూడు కోట్ల ముప్పది లక్షల (3,30,00,000) చెక్కును అందజేశారు. అనంతరం కేక్ కట్ చేసి నియోజక వర్గంలో ఉత్తమ సేవలను అందించిన 20మంది మహిళా ఉద్యోగులను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటి మేయర్ చల్ల స్వరూపారాణి, మార్కెట్ కమిటి చైర్మన్ రెడ్డవేణి మదు, కరీంనగర్ ఆర్డిఓ ఆనంద్ కమార్, సిడబ్ల్యుసి చైర్మన్ దనలక్ష్మీ, జిల్లా మార్కెటింగ్ అధికారి పద్మావతి, సఖీ వన్ స్టాప్ లీగల్ కౌన్సిలర్ సంద్యారాణి, మహిళాడిగ్రి కళాశాల ప్రిన్సిపల్ డా. టి. శ్రీలక్ష్మీ, కార్పోరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.