కరీంనగర్:42వ డివిజన్లో గడప గడపకు కాంగ్రెస్

కరీంనగర్:42వ డివిజన్లో
గడప గడపకు కాంగ్రెస్

  • కాంగ్రెస్ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్తూ సమస్యలు తెలుసుకుంటున్న నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి

కరీంనగర్ బ్యూరో, ఆగస్టు 10 (విశ్వం న్యూస్) : గత రెండు నెలలుగా నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరంలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం కొనసాగుతోంది.కాంగ్రెస్ పథకాలను కరపత్రాల ద్వారా ప్రజలలోకి తీసుకెళ్తూ సమస్యలను తెలుసుకుంటూ ఇంటింటికి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి తో పాటు నగర కాంగ్రెస్ నాయకులు వెళ్తున్నారు.అందులో భాగంగా గురువారం నలభై రెండవ డివిజన్ లో కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గ్యాస్ సిలిండర్ అయిదువందల రూపాయలకే ఇస్తామని సంవత్సరంలోపే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసరా పెన్షన్ నాలుగు ఇస్తామని తెలియజేస్తూ యూత్ డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ ను ప్రజల లోకి తీసుకెళ్తున్నామని అన్నారు.ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోందని వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలే కోరుకుంటున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ భాధ్యులు కుమ్మరి ఆంజనేయులు, మెగరాజు సాయిరాం, ఇరుగురాల అనిల్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, గడ్డం విలాస్ రెడ్డి, జీడి రమేష్, దండి రవీందర్, షబానా మహమ్మద్, ఎండి చాంద్, ముల్కల కవిత, కుర్ర పోచయ్య, సలిమొద్ధీన్, మెతుకు కాంతయ్య, నెల్లి నరేష్, అష్రాఫ్, ఎగ్గడి శారద, కూన దామోదర్, షేక్ శేహెన్ష, సయ్యద్ ఖలీల్, మామిడి సత్యనారాయణ రెడ్డి, ఇమ్రాన్, ఉప్పరీ అజయ్, కీర్తి కుమార్, నాగుల సతీష్, గంగుల దిలీప్, అనసూయ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *