కరీంనగర్:దినసరి వేతన కార్మికులకు కావాల్సిన వసతులు ఏర్పాటు చేయాలి

కరీంనగర్:దినసరి వేతన
కార్మికులకు కావాల్సిన
వసతులు ఏర్పాటు చేయాలి

  • మల్యాల సుజిత్ కుమార్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కరీంనగర్

కరీంనగర్, ఆగస్టు 3 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జ్యోతినగర్ వద్ద గల న్యూ లేబర్ అడ్డా వద్ద పబ్లిక్ లేదా మొబైల్ టాయిలెట్ వసతి కల్పించాలని గౌరవ జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) గారిని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగిందని జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మల్యాల సుజిత్ కుమార్ తెలిపారు. గత ఆదివారం కొంతమంది వేతన కార్మికులతో చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించినప్పుడు మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలని తెలిపారని అందులో ముఖ్యంగా దినసరి కార్మికులు తమ న్యూ లేబర్ అడ్డా వద్ద పబ్లిక్ టాయిలెట్స్ లేకపోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నామని తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు.

ఈ విషయమై గౌరవ జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)శ్రీ ప్రఫుల్ దేశాయ్ గారిని కలిసి వీలైనంత తొందరలో శివ థియేటర్ జ్యోతి నగర్ వద్ద గల న్యూ లేబర్ అడ్డా కార్మికుల సౌలభ్యంకోసం పబ్లిక్ టాయిలెట్స్ లేదా మొబైల్ టాయిలెట్స్ వసతిని కల్పించాలని విన్నవించడం జరిగిందని తెలిపారు మల్యాల సుజిత్ కుమార్. ఈ కార్యక్రమంలో బుర్ర నాగరాజు, పొన్నం మధు, గంగుల దిలీప్, భరత్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *