కరీంనగర్:మంత్రి గంగులకు
హామీలపై చిత్తశుద్ధి లేదు
- ఇరవై నాలుగు గంటలు నీళ్ళు దేవుడెరుగు రోజు అరగంట కూడా ఇవ్వలేకపొతున్నారు
- సంపు నిల్వసామర్థ్యం పెంచకుండా, పంపుహౌజ్ ను అభివృద్ధి పరచకుండా ఎలా సాధ్యం మంత్రి గంగుల కమలాకర్ కు ప్రజలకిచ్చిన హామీలపై చిత్తశుద్ధి లేదు:నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్ బ్యూరో, జూన్ 14 (విశ్వం న్యూస్) : నగరంలో చాలా ప్రాంతాలలో నల్లా నీళ్ళు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రోజు అరగంట నీళ్ళు ఇవ్వలేనోల్లు ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఎలా ఇస్తారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆరోపించారు.పంప్ హౌజ్ వద్ద గల మోటార్లను సంపును నగర కాంగ్రెస్ బృందం పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ అట్టహాసంగా మున్సిపల్ మంత్రి కెటీఆర్ తో పైలాన్ ఆవిష్కరింపజేసి రెండు సంవత్సరాలవుతుందని అన్నారు.
ఇరవై నాలుగు గంటలు నీళ్ళివ్వడానికి సంపు సామర్థ్యం పెంచకుండా తగినన్ని మోటార్లు ఏర్పాటు చేయకుండా ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఎలా సాధ్యమవుతుందని నరేందర్ రెడ్డి ప్రశ్నించారు. మంత్రి గంగుల కమలాకర్ కు హామీలపై చిత్తశుద్ధి లేదని మాటలకే పరిమితమవుతున్నారన్నారు. మానేర్ డ్యాంలో నీటినిల్వ తగ్గడం వల్ల రోజు అరగంట కూడా నీళ్ళు ఇవ్వలేకపోతున్నారని డ్యాం గేట్లు మరమ్మతులకు ఇది సమయం కాదని అన్నారు. ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఇవ్వగలుగుతామనే పాలకులకు నమ్మకం ఉంటే కేబుల్ బ్రిడ్జి ప్రారంభానికి వస్తున్న మంత్రి కేటీఆర్ తో ప్రారంభం చేయించి ఆరోజు నుండి ఇవ్వాలని నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సమద్ నవాబ్, శ్రవణ్ నాయక్,గుండాటీ శ్రీనివాస్ రెడ్డి,దన్న సింగ్, జీడీ రమేష్, షబానా మహమ్మద్,ముల్కల కవిత, షేక్ షేహెన్ష, ఎజ్రా దేవ్,బాలబద్రి శంకర్, కంకణాల అనిల్ కుమార్,ముక్క భాస్కర్, ఎగ్గడి శారద, నేన్నేల పద్మ, మామిడి సత్యనారాయణ రెడ్డి, ఎండి నదీమ్,నెల్లి నరేష్, సిరాజొద్దిన్, మహమ్మద్ భారీ,కుంబాల రాజ్ కుమార్, హనీఫ్,ముల్కల యొనా తదితరులు పాల్గొన్నారు.