కరీంనగర్:ఏమి సాధించారనిదశాబ్ది ఉత్సవాల సంబురాలు

కరీంనగర్:ఏమి సాధించారని
దశాబ్ది ఉత్సవాల సంబురాలు

  • దశాబ్ది ఉత్సవాల పేరుతో చేస్తున్నసంబరాలు హడావిడి ఏమి సాధించారని
  • తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాల గురించి
  • కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ కరీంనగర్ ప్రెస్ భవన్ లో

కరీంనగర్ బ్యూరో, జూన్ 12 (విశ్వం న్యూస్) : 5 లక్షల 60 వేల కోట్లు అప్పు చేశారు రాష్ట్రంలో పుట్టబోయే ప్రతి బిడ్డ ఒక లక్ష 25 వేల అప్పుతో పుడుతున్నది కాలేశ్వరం ప్రాజెక్టుతో 1,28,000 కోట్ల అప్పయింది. ఈ వేసవిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో నీళ్లు లేక మోటార్లు నిరుపయోగంగా పడి వున్నాయి కమిషన్ ల కక్కుర్తి కొరకు ప్రాజెక్టులు కట్టిండు. పోతిరెడ్డిపాడు నుండి మన కళ్ళ ముందు నీళ్లు దోచుకొని పోతుంటే కల్లప్పగించి చూస్తన్డు అయితే జగన్ తో కుమ్మక్కు అయి వుండాలి.1లక్ష 91 వేల ఖాళీ ఉద్యోగాలు ఉన్నాయని బిస్వాల్ కమిటీ అధికారికంగా ప్రకటించింది 80 వేల ఉద్యోగాలు కాదు 8000 కూడా ఇవ్వలేదు.

ఇవ్వాళ్ళ మీ సంబరాలు ఉత్సవాలు దీని కోసం. రైతులకు ప్రకటించిన డబ్బులు ఇంత వరకు ఇవ్వలేదు ధాన్యంలో 4 నుండి 5 కిలోల తక్కువ చేస్తుండు. రిస్మిల్లర్స్ ఇచే నివేదికను పరిగణలోకి తీసుకొని మిల్లర్లు ఎది చెపితే అది లెక్కలోకి తీసుకుంటుండు.మంత్రి గారిని అడుగుతున్న ఎలక్రోనిక్ తూకాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకుంటలేరు మిల్లర్స్ నివేదికను ఎందుకు పరిగణలోకి తీసుకుంటున్నావు. కింటాల్కు 5 కిలోలు రైతు నష్టపోతుంటే మంత్రి ఏమిచేస్తున్నాడు. రైతు బందు తో రైతుకు ఇచ్చేటివి అన్ని పోయినాయి. హమాలీల చార్జీల గురించి ఇచ్చే 5 రూపాయలు కూడా ప్రభుత్వం జేబులో వేసుకుంటోంది.

ఏమి సాధించారని ఈ సంబరాలు ఈ ఉత్సవాలు
2022 – 2023 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన 17,700 కోట్లలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. మీరు ఎవరిని మబ్య పెట్టడానికి మోసం చేయడానికి ఈ ఉత్సవాలు

బీసీ ల మీద ప్రేమ పుట్టుకొచ్చింది
లక్ష ఇస్తారట అని అందరూ సంబుర పడ్డారు. కానీ బీసీ జనాభాలో కేవలం 10 శాతం మాత్రమే లబ్ది లబ్ధి ఉండేవిధంగా 90 శాతానికి లబ్ధి చేకూరడం లేదు. గీతాలు గంగపుత్రులు పద్మ శాలీలు, కుర్మలు బీసీలలో లేరా వారికి ఎందుకు వర్తించదు. గొర్రె పిల్లలు వద్దని గొల్ల కురుమలు ఆ లక్ష ఇస్తే వారి బుద్ది పూర్వకంగా గార్లు కొనుక్కుంటామని అంటున్నారు. సాంఘిక సంక్షేమ బీసీ సంక్షేమ మంత్రులు మన దగ్గరనే ఉన్నారు ఈ రంగాలలో నువ్వు యేమి అభివృద్ధి చేసినవ్. నియోజక వర్గానికి 3 వేల ఇండ్లు కట్టిస్తామని అన్నాడు 12000 కోట్లు బడ్జెట్లో పెట్టి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినావు. అధికారుల అండదండలతో ఊరేగింపు చేస్తున్నావ్. అల్ప సంఖ్యాక వర్గాల ముస్లింల అభ్యున్నతికి యేమి స్కీంలు లేవు.

చదువుకున్నోనికి ఏమి లేదు చదువుకోనోనికి ఏమీ లేదు కానీ మొదటి దశాబ్దం లో దొర గారి కుటుంబం బాగుపడ్డది. నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పించడానికి 1 లక్ష 90 వేలు ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తు. కెసిఆర్ రెండు పాయలు కిందికి వదిలి ఒక్క పాయతో మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. రాష్ట్రం ఈ విధంగా నడుస్తుంది గమనించాలి మీ పద్దతి మార్చుకోండి అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. ఇథనాల్ ఫ్యాక్టరీతో ఆ ప్రాంతం అంతా కాలుష్యం వెదజల్లుతుంది. జన సముద్రం వున్న ఏరియాలలో ఏ విధంగా ఏర్పాటు చేస్తారు. మాకు ప్రజాభిప్రాయమే అంతిమము. చక్కర ఫ్యాక్టరీనీ ఎందుకు మూసినవ్. ఇది వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కాదా ఇతనాలుకు బదులు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టండి.

ఈ విలేఖరుల సమావేశంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *