తెలంగాణ సీఎం కేసీఆర్కు అండగా ఉంటామని సభలో ప్రకటించిన కేరళ సీఎం విజయన్
ఖమ్మం, జనవరి 18 (విశ్వం న్యూస్) : ఖమ్మం వేదికగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ బహిరంగ సభ లో కేరళ సీఎం పినరయి విజయన్ ప్రసంగం:
- దేశాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు కలిపి పాలిస్తున్నాయి
- కేంద్రం వైఖరితో లౌకికత్వం ప్రమాదంలో పడింది
- దేశంలో రాజ్యాంగం సంక్షోభంలో పడింది.
- భావసారూప్యత కలిగిన పార్టీలతో బీఆర్ఎస్ కలిసి రావడం శుభపరిణామం
- తెలంగాణ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ప్రజలకు మద్ధతుగా నిలుస్తోంది
- సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం అద్భుతం
- కేసీఆర్ చేపట్టిన పోరాటానికి మా మద్ధతు ఉంటుంది, వారికి అండగా ఉంటాం.
- కంటి వెలుగు కార్యక్రమం దేశ చరిత్రలో నిలిచిపోతుంది
- ఇవాళ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది
- జాతికి ఈ సభ దిశానిర్ధేశం చేయాలి
- తెలంగాణ తరహా సంక్షేమ కార్యక్రమాలను కేరళలోనూ చేపట్టాం
- తెలంగాణ పోరాటాలు చేసిన నేల
- దేశ సమగ్రతను, న్యాయాన్ని, హక్కులను కాపాడుకోవాల్సని బాధ్యత మనపై ఉంది
- కేంద్రంపై పోరాటానికి కేసీఆర్ నడుం బిగించారు
- రాష్ట్రాల సమ్మేళనమే దేశం.. ఫెడరల్ స్ఫూర్తి ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతినకూడదు
- గవర్నర్ వ్యవస్థను రాజకీయం కోసం వాడుకుంటున్నారు.
- సంస్కరణల పేరుతో కేంద్రం అనైతిక విధానాలను అమలు చేస్తోంది
- ఇవాళ దేశం ప్రత్యేక పరిస్థితుల్లో ఉంది, ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి
- ఖమ్మం సభ దేశానికి దిక్సూచీ
- మోదీపాలనలో ఫెడరల్ స్ఫూర్తి దెబ్బతింటున్నది
- తెలంగాణలో కంటి వెలుగు సహా కలెక్టరేట్లు తదితర కార్యక్రమాలు బాగున్నాయి.
- వాటిని కేరళలోనూ అమలుపరిచేందుకు ప్రయత్నిస్తాం
- చర్చలు జరగకుండానే చట్ట సభల్లో బిల్లులు పెడుతున్నరు..
- న్యాయ వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేశారు
- రాష్ట్రాలను కేంద్రం లెక్కలోకి తీసుకోవడం లేదు
- మాతృభాషను చంపే ప్రయత్నంలో భాగంగానే హిందీని మనపై బలంగా రుద్దుతున్నారు.
- కార్పోరేట్ శక్తులకే కేంద్రం ఊతమిస్తోంది
- సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేందుకే కేంద్రం ప్రయత్నిస్తున్నది
- ఉపరాష్ట్రపతి కూడా సుప్రీంను కించపరిచేలా మాట్లాడారు
- న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తోంది
- ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా జరిగే పోరాటం కూడా తెలంగాణ నుంచే ప్రారంభం కావాలిః
- దేశాన్ని కులం, మతం పేరుతో చీలుస్తోంది.
- న్యాయవ్యవస్థలో కేంద్రం మితిమీరి జోక్యం చేసుకుంటోంది
- విదేశీ మారక ద్రవ్య నిధులు తరిగిపోతున్నాయి
- కేరళ ప్రజలు సీఎం కేసీఆర్ వెన్నంటే ఉంటారు
• బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జాతికి దిశానిర్దేశం చేస్తుంది.
• బీఆర్ఎస్ ఏర్పాటుతో భావసారూప్యత కలిగిన పార్టీలు ఒక్కటయ్యే అవకాశం వచ్చింది.
• తెలంగాణ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ప్రజలకు మద్దతుగా నిలుస్తున్నది.
• ఫెడరల్ స్పూర్తికి వ్యతిరేకంగా మోడీ పాలన సాగుతోంది.
• బీజేపీ, ఆర్ఎస్ఎస్లు కలిసి దేశాన్ని పాలిస్తూ ప్రజల్లో విద్వేషాలు పెంచుతున్నాయి.
• కేంద్రం రాష్ట్రాలకు రావాల్సిన నిధులు ఇవ్వకపోగా.. గవర్నర్ వ్యవస్థను కేంద్రం దుర్వినియోగం చేస్తున్నది.