బండి సంజయ్ కుమారుడి కేసులో కీలక మలుపుPOCSO బాధితురాలు మైనర్‌నే అని పోలీసుల నిర్ధారణ

హైదరాబాద్, మే 15 (విశ్వం న్యూస్) : బీజేపీ నాయకుడు బండి సంజయ్ కుమార్ కుమారుడికి సంబంధించిన POCSO కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధితురాలి వయసుపై కొనసాగుతున్న వివాదానికి పోలీసులు పూర్తి స్థాయిలో స్పష్టత తీసుకువచ్చినట్లు సమాచారం.

బాధితురాలు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జన్మించినట్లు పేర్కొంటూ తన జనన ధృవీకరణ పత్రాన్ని దర్యాప్తు అధికారులకు సమర్పించింది. ఆ పత్రాల ఆధారంగా సంబంధిత సంవత్సరానికి చెందిన GHMC జనన నమోదుల రికార్డులను పోలీసులు పరిశీలించారు. ఆసుపత్రి వివరాలు, నమోదు తేదీలు, అధికారిక పుట్టిన తేదీ వివరాలు అన్ని సరిపోవడంతో బాధితురాలు మైనర్‌నే అని పోలీసులు నిర్ధారించినట్లు తెలిసింది.

ఈ నిర్ధారణతో కేసులో POCSO చట్టంలోని సెక్షన్లు మరింత బలపడే అవకాశముందని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే సేకరించిన ఆధారాలు, డిజిటల్ సమాచారం, సాక్ష్యాలతో పాటు ఇప్పుడు వయసు ధృవీకరణ కూడా స్పష్టంగా రావడంతో దర్యాప్తు కీలక దశకు చేరుకున్నట్లు సమాచారం.

ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లోనూ తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రతిపక్షాలు ఈ అంశంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా, అధికార వర్గాలు పూర్తి స్థాయి విచారణ అనంతరం నిజాలు వెలుగులోకి వస్తాయని పేర్కొంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *