కెకె నగర్ ఫేజ్-2 B1 లేన్లో:తాళం వేసి ఉన్న ఇంట్లో భారీ చోరీ
తాళం వేసి ఉన్న
ఇంట్లో భారీ చోరీ

- రూ.62000 డబ్బు, 50 గ్రాముల బంగారం అపహరణ
హైదరాబాద్, జూన్ 3 (విశ్వం న్యూస్) : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గంధంగూడ కెకె నగర్ ఫేజ్-2 B1 లేన్లో అదివారం రాత్రి Hosue Number 19 ఇంట్లో చోరీ కలకలంరేపింది. ఆయ ఇంట్లో చొరబడిన దొంగలు డబ్బు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు.

ఇంటి యజమానులు బయటికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో ఇంట్లోని వస్తువులు చెల్లాచెదరుగా పడి ఉండటం, బీరువా పగలగొట్టి భారీ మొత్తంలో బంగారం, నగదు, వెండి అపహరణకు గురైనట్లు చెబుతున్నారు.
యజమానులు సమాచారంతో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.
