
హైదరాబాద్, ఏప్రిల్ 16 (విశ్వం న్యూస్) : హైదరాబాద్ కుషాయిగూడలో జరిగిన అగ్నిప్రమాదంలో చిన్నారి సహా దంపతులు సజీవ దహనమయ్యారు. ఇక్కడి టింబర్ డిపోలో వేకువజామున 3 గంటలకు అగ్నిప్రమాదం జరగడంతో క్షణాల్లోనే పక్కనే ఉన్న భవనానికి వ్యాపించాయి. అందులో నివసిస్తున్న దంపతులు, వారి చిన్న కుమారుడు తప్పించుకునే మార్గం లేక మంటల్లో చిక్కుకుని మరణించారు.
మృతులు యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తికి చెందిన నరేశ్ (35), సుమ(28), జోషిత్(5)గా గుర్తించారు. మరో చిన్నారి ఆచూకీ తెలియలేదు. మృతదేహాల కోసం అధికారులు గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.