
హైదరాబాద్, ఏప్రిల్ 15 (విశ్వం న్యూస్) : ఐ.ఎం.బీడీ.సెలబ్రిటీల జాబితాలో రష్మిక మందన్న మూడో స్థానంలో ఉంది. ఇంటర్నెట్ మూవీ డేటాబేసు (ఐ.ఎం.బీడీ) వీడియోలకి సంబంధించిన ఒక వెబ్ సైటు ఇది. సినిమాలు, TV షోలు, నటులు, సాంకేతిక నిపుణుల వివరాలతో కూడిన అతి పెద్ద ఆన్ లైన్ సమాచార కేంద్రం.ఇది ప్రస్తుతం అమెజాన్ సంస్థ ఆధ్వర్వంలో నడుస్తుంది. తన ప్రతిభ, క్రేజ్‌తో, ఈ వారం IMDb యొక్క పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ ఫీచర్‌ల జాబితాలోకి ప్రవేశించినందున రష్మిక మందన్న అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ నెల ప్రారంభంలో రష్మిక మందన్నతన పుట్టినరోజును జరుపుకుంది, అదే రోజు పుష్ప 2 గ్లిమ్ప్స్ విడుదల చేసింది. ఆ తర్వాత అల్లుఅర్జున్ పుట్టినరోజు కావడంతో టీజర్‌ను విడుదల చేసింది. ఈ రెండు రోజులూ ఇంటర్నెట్‌లో ఎక్కువగా మాట్లాడుకునే సెలబ్రిటీలలో రష్మిక ఒకరు.

ఇక రష్మిక ప్రస్తుతం వెంకీ కుడుముల, నితిన్, చిత్రాలు చేయనుంది. పుష్ప 2 సెట్స్‌లో ఆమె చేరనుంది.