ఎమ్మెల్సీ కవిత జంతర్ మంతర్ దీక్షలో పాల్గొన్న నేతలు
పిర్జాదిగూడ, మార్చి 10 (విశ్వం న్యూస్) : భారతదేశ చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలనే ఏకైక డిమాండ్‌తో శుక్రవారం జంతర్ మంతర్ వద్ద భారత్ జాగృతి అధ్యక్షురాలు, భారాస ఎమ్మెల్సీ కవిత నిత్యత్వంలో ఒకరోజు నిరసన దీక్ష నిర్వహించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ లో పాల్గొని సంఘీభావం తెలియజేసిన మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి పార్లమెంట్ బారాస పార్టీ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, పిజ్జాదిగూడ బారాస పార్టీ అధ్యక్షులు దర్గ దయాకర్ రెడ్డి. ఈ ధర్నా కార్యక్రమంలో ఢిల్లీ హర్యానా పంజాబ్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుండి వచ్చిన మహిళ నాయకురాళ్ళు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసారు.