టోల్‌గేట్‌ను ఢీకొన్న లారీ..
సీసీకెమెరా దృశ్యాలు

జనగామ,, ఏప్రిల్ 20 (విశ్వం న్యూస్) : జనగామ జిల్లాలోని వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై మరోసారి మానవ తప్పిదం ప్రమాదానికి దారితీసింది. కోమల్ల టోల్ గేట్ వద్ద ఇవాళ ఉదయం ఓ వేగంగా వచ్చిన లారీ నియంత్రణ కోల్పోయి టోల్ క్యాబిన్ లోకి దూసుకెళ్లింది.
ఈ ఘటనలో టోల్ గేట్‌లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది గాయాలపాలయ్యారు. గాయపడ్డవారిని స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
ప్రమాదంలో టోల్ క్యాబిన్ పూర్తిగా ధ్వంసమైంది. భారీగా నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
ఘటన స్థలాన్ని సందర్శించిన పోలీసులు, రహదారి భద్రతా ప్రమాణాలను పరిశీలించి, భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.