సరూర్నగర్ లో జరిగే బీ.ఎస్.పి పార్టీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి

బీ.ఎస్.పి పార్టీ భారీ బహిరంగ
సభను విజయవంతం చేయండి

  • మే 7 తారీఖు నాడు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాయావతి హాజరు
  • బిఎస్పి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
    ఆధ్వర్యంలో సభ..
  • మేడ్చల్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అంబేద్కర్, రవీందర్ నాయక్ పిలుపు

సరూర్నగర్, మే 5 (విశ్వం న్యూస్) : బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు, యూపీ పూర్వ ముఖ్యమంత్రి, భావి భారత ప్రధాని బెహాన్ జి కుమారి మాయావతి తెలంగాణ రాష్ట్రానికి ఈ నెల ఏడవ తేదీన విచ్చేస్తున్న సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అద్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపిఎస్ అధ్వర్యంలో సరూర్నగర్ లో నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బీఎస్పీ పార్టీ అధ్యక్షులు బానోత్ రవీందర్ నాయక్, ప్రధాన కార్యదర్శి ఇటికాల అంబేద్కర్ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 7 తారీకు నాడు జరిగే ఈ భారీ బహిరంగ సభకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఐదు అసెంబ్లీల నుండి తెలంగాణ భరోసా బహిరంగ సభను విజయవంతం చేయడానికి జిల్లా నుండి పది వేల మంది కి పైగా పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు వస్తున్నారని అన్నారు. ఈ సభ తెలంగాణ రాజకీయాలలో సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని, ప్రజలకు మాయవతి ఇచ్చే సందేశం, బరోసా కోసం ఎదిరిచూస్తున్నామని అన్నారు. దేశ రాజకీయాలలో రాబోయే రోజుల్లో బిఎస్పీ అత్యంత ప్రభావిత శక్తిగా ఎదిగి ఈ దేశాన్ని పాలించే అవకాశాలు మెండుగా ఉన్నాయని, అందుకు ఉదహారణ తెలంగాణలో బిఎస్పీ అనూహ్యంగా పుంజుకున్న విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో బీజేపీ పార్టీ ని వొడించి రాష్ట్రాన్ని తద్వారా దేశాన్ని కాపాడుకోవడమే బిఎస్పీ ప్రధాన లక్ష్యం అని అన్నారు.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఉన్న కార్యకర్తలు మేధావులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, బిఎస్పీ పార్టీ సానుభూతిపరులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా ఇంచార్జి గౌడ సుదర్శన్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇటికాల అంబేద్కర్, జిల్లా కోశాధికారి కసుకుర్తి శ్రీహరి, ఉపాధ్యక్షులు మల్లేష్ తదితరులు హాజరయ్యరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *